కత్తిపై జానా గుస్సా

Submitted by arun on Wed, 07/04/2018 - 14:25
kathijana

శ్రీరాముడిపై కత్తి మహేశ్‌ మాట్లాడిన విధానం సరైంది కాదన్నారు కాంగ్రెస్‌ సీనియర్ నేత జానారెడ్డి. కత్తి మహేశ్‌ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ ఖండిస్తుందన్న ఆయన టెర్రిరిస్టులకు, కత్తి మహేశ్‌కు తేడా లేదన్నారు. రెచ్చగొట్టే విధంగా కత్తి మహేశ్‌ మాట్లాడటం సరైంది కాదన్న ఆయన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ కత్తి మహేశ్‌ లాంటి వారి వ్యాఖ్యలు వర్గాలను రెచ్చ గొట్టే  విధంగా ఉన్నాయన్నారు. సమాజంలో ఆందోళనలు కలిగించే విధంగా మాట్లాడటం క్షమించరానిదన్నారు. ఇలాంటి విషయాల్లో జర్నలిస్టులు సంయనం పాటించాలని, అసహ్యమైన మాటలు ప్రచురించకూడదన్నారు. అలాంటప్పుడే రాజకీయ నాయకులు ఇది సరికాదని తెలుసుకుంటారన్నారు. సంస్కార హీనంగా ఎవరు మాట్లాడినా తప్పేనని ఆయన వ్యాఖ్యానించారు. 

English Title
janareddy reacts kathi mahesh controversial comments

MORE FROM AUTHOR

RELATED ARTICLES