రెచ్చిపోయిన ప్రేమోన్మాది...ప్రేమించడం లేదంటూ యువతిని బావిలోకి తోసిన ప్రేమోన్మాది

x
Highlights

జనగామ జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించేందుకు నిరాకరించిన యువతిని ప్రేమోన్మాది బావిలోకి తోసేసాడు. జఫర్‌ఘడ్ ‌మండలం ఉప్పుగల్లుకు చెందిన...

జనగామ జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించేందుకు నిరాకరించిన యువతిని ప్రేమోన్మాది బావిలోకి తోసేసాడు. జఫర్‌ఘడ్ ‌మండలం ఉప్పుగల్లుకు చెందిన రాజేష్ గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించమంటూ వేధిస్తున్నాడు. ఇందుకు యువతి నిరాకరిస్తూ ఉండటంతో ఆగ్రహించిన రాజేష్‌ యువతిని బలవంతంగా ఊరి బయటకు తీసుకెళ్లి పాడుపడిన బావిలో తోసేసాడు. అనంతరం తాను కూడా బావిలో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. యువతి కేకలు విని బావి దగ్గరకు చేరుకున్న స్ధానికులు బాధితురాలిని బయటకు తీసి జనగామ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయినట్టు స్థానికులు తెలిపారు. ప్రేమోన్మాదిని బయటకు తీసుకొచ్చేందుకు స్ధానికులు ప్రయత్నించినా రాకపోవడంతో బావిలోనే వదిలేసి వెళ్లారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories