కానిస్టేబుల్ ను కిడ్నాప్ చేసి దారుణంగా చంపిన ఉగ్రవాదులు!

Submitted by arun on Fri, 07/06/2018 - 10:22
jammu

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. సోఫియాన్‌ జిల్లాలోని ఖచ్‌దోరాలో కానిస్టేబుల్‌ జావేద్‌ అహ్మద్‌ దార్‌ను కిడ్నాప్‌ చేసి దారుణంగా హత్య చేశారు. కానిస్టేబుల్‌ను నిన్న కిడ్నాప్‌ చేసిన ఉగ్రవాదులు... చంపేసి గ్రామ శివార్లలో శవాన్ని పడేసి వెళ్లారు.‎ దారుణంగా హింసించి ... కాల్చి చంపారు. శరీరాన్ని బులెట్లతో చీల్చిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు... పోస్ట్‌‌మార్టం అనంతరం గౌరవ వందనం సమర్పించి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పంగించారు.

English Title
Jammu And Kashmir Police Constable Kidnapped, Killed By Terrorists

MORE FROM AUTHOR

RELATED ARTICLES