వైసీపీ అధినేత దగ్గర సిట్‌‌కు చుక్కెదురు

Submitted by arun on Sat, 10/27/2018 - 10:16

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన జగన్‌పై దాడి కేసు మరో మలుపు తిరిగింది. కేసు దర్యాప్తు చేస్తున్న సిట్‌కు స్టేట్‌మెంట్ ఇవ్వడానికి వైసీపీ అధినేత నిరాకరించడంతో తదుపరి ఏం జరుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది. అసలు జగన్ వాంగ్మూలం ఇవ్వడం తప్పని సరా..జగన్ విషయంలో సిట్ అధికారులు తర్వాత ఏం చేయబోతున్నారనే అంశాలు ఆసక్తి రేపుతున్నాయి.

వైసీపీ అధినేత దగ్గర సిట్‌‌కు చుక్కెదురు...ఏపీ పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చేది లేదన్న జగన్... ఏదైనా కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుడితో పాటు బాధితుడి స్టేట్ మెంట్ రికార్డు చేయడం మామూలే. బాధితుడు పోలీస్ స్టేషన్‌కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే దర్యాప్తు అధికారులే స్వయంగా బాధితుడి దగ్గరికి వెళ్లి వాంగ్మూలం నమోదు చేస్తారు. ఒక వేళ బాదితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే డాక్టర్ అనుమతితో విచారణ చేస్తారు. అయితే కత్తి దాడి కేసులో జగన్ వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించడంతో ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం‌కు చిక్కొచ్చిపడింది.

వైజాగ్ ఎయిర్ పోర్ట్‌లో కత్తి దాడి ఎలా జరిగింది నిందితుడు ఘటనా స్థలానికి వచ్చి ఏం మాట్లాడాడు దాడికి ముందు అసలేం జరిగింది వంటి విషయాలను సిట్ అధికారులు జగన్‌ను ప్రశ్నిద్దామని అనుకున్నారు. కానీ వైసీపీ అధినేత నో చెప్పడంతో పోలీసులు వెనుదిరగక తప్పలేదు. అయితే బాధితుడు స్టేట్ మెంట్ ఇవ్వడం తప్పనిసరి కాదని మాజీ పోలీసు అధికారులు అంటున్నారు. వాంగ్మూలం ఇవ్వడం స్వచ్ఛందమని చెబుతున్నారు. ఒకవేళ బాధితుడు పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చినా దానికి పెద్దగా విలువ ఉందడని అనుభవజ్ఞులైన అధికారులు చెబుతున్నారు. పోలీసులు రికార్డు చేసే స్టేట్ మెంట్ ను కోర్టు పరిగణలోకి తీసుకోకపోవచ్చని అంటున్నారు. కేవలం మేజిస్ట్రేట్, డాక్టర్ సమక్షంలో నమోదు చేసిన స్టే‌ట్‌మెంట్‌ మాత్రమే కోర్టులో నిలబడుతుందని వివరిస్తున్నారు. మరి ధర్డ్ పార్టీకి మాత్రమే స్టేట్ మెంట్ ఇస్తానని జగన్ తేల్చి చెప్పడంతో సిట్ అధికారులు తదుపరి ఏం చేస్తారనేది ఉత్కంఠగా మారింది.

English Title
Jagan Shock To AP Police Officials., Rejects To Give Statement

MORE FROM AUTHOR

RELATED ARTICLES