వైసీపీలో కలకలం..యేథేచ్చగా వర్గవిబేధాలు

వైసీపీలో కలకలం..యేథేచ్చగా వర్గవిబేధాలు
x
Highlights

వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు జగన్ పాదయాత్ర చేస్తుంటే.. అనంతపురం జిల్లాలో మాత్రం ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 4న బసినేపల్లి...

వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు జగన్ పాదయాత్ర చేస్తుంటే.. అనంతపురం జిల్లాలో మాత్రం ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 4న బసినేపల్లి తండా నుంచి జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. తొలిరోజు జిల్లా నేతలు కొందరు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. 16రోజులుగా జగన్ పాదయాత్రను కొనసాగిస్తున్నా.. ఆ పార్టీ లో నెలకొన్న విబేధాలు మాత్రం బయటపడుతూనే ఉన్నాయి. గ్రూపు తగాదాలు, పార్టీ ఫిరాయింపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.
ఇప్పటికే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పార్టీకి ముందు నుంచి కీలకంగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి పార్టీని వీడారు. ఉరవకొండ నియోజకవర్గంలో కీలక నేత మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డి, ఆయన కుమారుడు భీంరెడ్డి నియోజకవర్గంలో పాదయాత్రకు దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. రాప్తాడు నియోజకవర్గలో అత్యధిక ఓటుబ్యాంకు ఉన్న కక్కలపల్లి కాలనీ ఎంపీటీసీ, పార్టీ కీలక నేత ధనుంజయ్ యాదవ్ కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. రాప్తాడు నియోజకవర్గానికే చెందిన మాజీ ఎంపీపీ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆలుమూరు శ్రీనివాసరెడ్డి స్థానిక నేతల తీరుతో విబేధించి పాదయాత్రకు దూరంగా ఉన్నారు. జగన్ పాదయాత్ర సాగిన గుంతకల్లు, శింగనమల, ఉరవకొండ, రాప్తాడు, అనంతపురం, ధర్మవరం నియోజకవర్గాల్లో నెలకొన్న విబేధాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, ఆ పార్టీ నేతలు మాత్రం అందరం కలిసి ముందుకెళతామని చెబుతున్నారు.
పార్టీలో గ్రూపు రాజకీయాలతో పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకొని.. పార్టీ అభివృద్ధికి పాటు పడాల్సిన నేతలు, స్వంత ప్రయోజనాలు, స్వార్థ రాజకీయాల కోసం పనిచేస్తున్నారని మండిపడుతున్నారు. జిల్లాలో పార్టీనేతల మధ్య నెలకొన్న వర్గ విబేధాలపై ఇప్పటికైనా అధినేత దృష్టి సారించాలని వైసీపీ దిగువ శ్రేణి నేతలు, కార్యకర్తలు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories