నేటినుంచి ధర్మవరంలో జగన్ పాదయాత్ర.!

Submitted by kasi on Sat, 12/16/2017 - 10:58

ప్రజాసమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో  రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.. ఇవాళ ఉదయం అయన పాదయాత్ర  ధర్మవరం నియోజకవర్గం చిగిచెర్ల నుంచి ప్రారంభించారు.. అక్కడినుంచి వసంతపురం, గరుడంపల్లి క్రాస్‌ రోడ్డు మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం 2.45 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. బాదన్నపల్లి మీదుగా సాయంత్రం 4 గంటలకు మల్కాపురం క్రాస్‌ చేరుకుంటారు. అక్కడ పార్టీ జెండా ఎగురవేస్తారు. తర్వాత గొట్లూరు మీదుగా సాయంత్రం 5.30కు ధర్మవరం క్రాస్‌ రోడ్డు వరకు పాదయాత్ర కొనసాగిస్తారని పార్టీ పాదయాత్ర విభాగం తెలిపింది..

English Title
jagan paadhayaatra in dharmavaram

MORE FROM AUTHOR

RELATED ARTICLES