ఆ ఎన్నికకు సిద్ధంగా లేని జగన్..?

ఆ ఎన్నికకు సిద్ధంగా లేని జగన్..?
x
Highlights

ప్రజల కష్టాలు , నష్టాలు ప్రత్యక్షంగా తెలుసుకోవాలని వారికి అండగా నిలవాలని వీలైనంత త్వరగా రాష్ట్రంలో అధికారం చేపట్టాలనే ఉద్దేశంతో ఇడుపులపాయ నుంచి...

ప్రజల కష్టాలు , నష్టాలు ప్రత్యక్షంగా తెలుసుకోవాలని వారికి అండగా నిలవాలని వీలైనంత త్వరగా రాష్ట్రంలో అధికారం చేపట్టాలనే ఉద్దేశంతో ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ప్రజాసంకల్పయాత్ర పేరుతో ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.. పాదయాత్ర ప్రస్తుతం సజావుగా సాగుతున్న ఆ పార్టీకి కొత్తగా ఎన్నికల భయం పట్టుకుందని అంటున్నారు.. నాలుగునెలల కిందట పార్టీకి నంద్యాల ఉపఎన్నిక రూపంలో వచ్చిన ఉప్పెన అంత ఇంతా కాదు ఆ ఎన్నిక తరువాత చాల మంది వైసీపీని వీడారు.. మరికొంతమంది కీలక నేతలు క్యూ లో ఉన్నట్టు ప్రచారం ఊపందుకుంది..

నంద్యాల ఉపఎన్నిక సందర్బంగా శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీ నుంచి వైసీపీ గూటికి చేరే సమయంలో జగన్ విధించిన రాజీనామా షరత్ వలన టీడీపీ ద్వారా వచ్చిన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు చక్రపాణి.. దీంతో ఆ స్థానానికి వచ్చే ఏడాది ఎన్నిక నిర్వహించబడుతుందని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది.. ఈ నేపథ్యంలో ఎన్నికకు అధికార టీడీపీ సిద్ధంగా ఉన్నా ప్రతిపక్షం వైసీపీ సిద్ధంగా లేదనే వాదన వినబడుతుంది.. దీనికి కారణం కూడా లేకపోలేదు ఇప్పటికే నంద్యాల ఉపఎన్నిక తరువాత ఆ పార్టీ కొంత నిరుత్సాహానికి లోనైనట్టు ప్రచారం జరుగుతుంది.. ఇటువంటి సమయంలో మళ్ళి ఎన్నికలకు వెళ్లాలంటే గెలుపోటములపై బేరీజు వేసుకోవాలి ఏమాత్రం ఐడియాలజీ తారుమారైన పార్టీ మనుగడకే ఇబ్బంది ఎదురవుతుందనేది వైసీపీకున్న అభిప్రాయమట..

అంతేకాదు ఒక్క ఎమ్మెల్సీ సీటువల్ల వచ్చే లాభమేమిటి, పైగా ఉపఎన్నిక జరిగేది కర్నూల్ జిల్లాలో కాబట్టి నాయకులూ కూడా అంత సుముఖంగా ఉండకపోవచ్చు, ఇదిలావుంటే నంద్యాల ఉపఎన్నికల్లో భారీ ఓటమి చవిచూసిన తరువాత శిల్పా సోదరులు పోటీపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని అంటున్నారు.. ఇక జిల్లాలో మరో పెద్ద రాజకీయ కుటుంభంగా భావించే గంగుల ఫామిలీ పోటీకి దిగుతుందా అంటే టీడీపీలో ఉన్న గంగుల ప్రతాప్ రెడ్డి వలన నష్టం జరగవచ్చని వైసీపీ నేతలు అంచనా వేసుకుంటున్నారు.. ఎంత ప్రయత్నించినా టీడీపీ అధికారంలో ఉండటం చేత ఆ పార్టీ గెలుపు నల్లేరుమీద నడకనే అభిప్రాయంతో శాసనమండలి ఉపఎన్నికకు దూరంగా ఉండాలని పార్టీ పెద్దలు జగన్ కు సూచించారట.. మరి దీనిపై జగన్ ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారో చూడాలంటె మరి కొద్ది రోజులు ఆగాల్సిందే..

Show Full Article
Print Article
Next Story
More Stories