వారితో వన్ టు వన్ మాట్లాడుతున్న జగన్

Submitted by nanireddy on Sat, 10/20/2018 - 15:32
jagan meets with assembly incharges

జిల్లాల వారీగా, పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సమీక్షలు పూర్తిచేసిన వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి... ఇప్పుడు అసెంబ్లీ స్థానాలపై దృష్టిపెట్టారు. నియోజకవర్గ ఇన్‌‌ఛార్జులతో వన్ టు వన్ మాట్లాడుతున్న జగన్‌... పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తున్నారు. సర్వేల రిపోర్టులను ముందు పెడుతూ... పనితీరు మెరుగుపర్చుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు.

ఒకపక్క పాదయాత్ర చేస్తూనే... మరోవైపు వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు వైసీపీ అధినేత జగన్‌. ఎప్పటికప్పుడు నియోజకవర్గ ఇన్‌‌‌ఛార్జులతో సమావేశమవుతూ... పార్టీ పరిస్థితిపై అంచనాకి వస్తున్నారు. తాను చేయించిన సర్వేలు ఆధారంగా దిశానిర్దేశం చేస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌‌‌ఛార్జులతో వన్ టు వన్‌ మాట్లాడుతూ... ఎవరైనా బలహీనంగా ఉంటే వార్నింగ్‌ ఇస్తున్నారు. సర్వే రిపోర్టులను వాళ్ల ముందుపెట్టి‌... పనితీరు మెరుగుపర్చుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు.

 ముఖ్యంగా విభేదాలు పక్కనబెట్టి... అందర్నీ కలుపుకొనిపోవాలని సూచిస్తున్నారు. ఇక ఇంటింటికీ వైసీపీ, నవరత్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నిర్లక్ష్యం వహిస్తున్న నేతలకు గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. అలాగే సామాజికవర్గాల వారీగా ఓట్లపై దృష్టిపెట్టాలని, ముఖ్యంగా మహిళలు, యువతను ఆకర్షించేందుకు కార్యక్రమాలు చేపట్టాలని దిశానిర్దేశం చేస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌‌‌ఛార్జుల పనితీరుపై మరో సర్వే జరుగుతోందని, దానిలో మెరుగైన ఫలితాలు సాధించనివారిపై వేటు తప్పదని జగన్ తేల్చిచెబుతున్నట్లు తెలుస్తోంది.

English Title
jagan meets with assembly incharges

MORE FROM AUTHOR

RELATED ARTICLES