జగన్ కు ఈడీ మరో షాక్

Submitted by arun on Thu, 01/04/2018 - 10:52

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసులో ఈడీ మరోసారి ఆస్తులు అటాచ్ చేసింది. రూ.117.74 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. ఇది జగన్‌కు మరో షాక్ అని చెప్పవచ్చు. గృహ నిర్మాణ ప్రాజెక్టుల ఛార్జీషీటులో ఈ ఆస్తులను అటాచ్ చేసింది. జగన్ కంపెనీల్లోకి పెట్టుబడుల రూపంలో నిధులు మళ్లించి అప్పటి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం నుంచి భారీగా లబ్ధి పొందిన ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి, ఆయనకు సహకరించిన మరో రెండు సంస్థలకు చెందిన రూ.117 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

English Title
jagan case ed attaches rs 117 crore assets

MORE FROM AUTHOR

RELATED ARTICLES