బంగారం టాయ్‌లెట్‌ లో ఎంజాయ్ చేస్తారా

Submitted by lakshman on Tue, 02/06/2018 - 05:27
 Guggenheim's 18-karat gold toilet

బంగారంతో ఆభరణాలు చేయించుకుంటుంటాము కానీ బంగారు మరుగుదొడ్డి కూడా తయారు చేస్తారా అంటే.. అవును అనాల్సిందే. ఎందుకంటే 18 క్యారట్ల బంగారంతో తయారు చేసిన మరుగుదొడ్డిని న్యూయార్క్‌ లోని సాలమన్‌ గుగ్గెన్‌ హీమ్‌ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఇది మ్యూజియంలో ఉందంటే కేవలం చూడటానికి అనుకుంటే పొరపాటు. మ్యూజియానికి వచ్చే ఎవరైనా బాత్‌ రూమ్‌ లోకి వెళ్లి ఈ బంగారు టాయ్‌లెట్‌ ను ఉపయోగించుకోవచ్చు. ఇందుకుగాను కొంత మొత్తాన్ని చెల్లించాలి. మ్యూజియంలో 14వ అంతస్తులో దీనిని ఏర్పాటు చేశారు. ఏప్రిల్ కు ముందే దీని తయారీ మొదలైంది. ప్రస్తుతం దీనిని ఉపయోగించుకునేందుకు రెడీ చేసి ప్రారంభ కార్యక్రమం కూడా అట్టహాసంగా నిర్వహించారు. మార్కెట్ లో బంగారం ధరను బట్టీ దీనిని తయారు చేయడానికి సుమారు 1,474,592 నుంచి 2,527,872 డాలర్ల దాకా ఖర్చు అయి ఉండవచ్చని అంచనా. ఈ మరుగు దొడ్డి 70 నుంచి 120 పౌండ్ల బరువు ఉంది. ఇటలీకి చెందిన మౌరిజియో కాటెలన్‌ దీనిని రూపొందించారు. సందర్శకులు దీనిని ఉపయోగించుకునేటప్పుడు బాత్ రూమ్ బయట పెద్ద సెక్యూరిటీ కూడా ఉంటుంది. అలాగే యూజ్ చేసిన తర్వాత మరుగుదొడ్డి పాడవకుండా ఉండేందుకు ఆటోమేటిక్ గా క్లీన్ చేసుకునే హై టెక్నాలజీ సిస్టాన్ని ఏర్పాటు చేశారు. 

బంగారు మరుగుదొడ్డి ఇదే మొదటిది కాదు గతంలో సౌదీ రాజు తన కూతురి పెళ్లి కానుకగా గోల్డెన్ టాయిలెట్ చేయించి ఇచ్చాడు. పెళ్లి వేడుకలో పెళ్లికూతురు అంగరంగ వైభవంగా జరిపించాడు. కట్నకానుకలుగా బంగారంతో తయారు చేసిన మరుగుదొడ్డిని కూడా ఇచ్చాడు. అంతేకాదు పెళ్లి కూతురు డ్రస్‌ కూడా అంతా బంగారుమయమే. రూ.180 కోట్ల బంగారం గౌనుతో రాజుగారి కూతురు ధగధగా మెరిసిపోయింది.

English Title
Jade Solomon keeps the Guggenheim's 18-karat gold toilet sparking clean

MORE FROM AUTHOR

RELATED ARTICLES