పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ప్రధాని..

Submitted by nanireddy on Fri, 06/22/2018 - 09:47
jacinda-ardern-nz-prime-minister-gives-birth-to-girl

ప్రధానమంత్రి ఏంటి పండంటి ఆడబిడ్డకు  జన్మనివ్వడమేంటని అనుకుంటున్నారా..? మీరు చూసేది నిజమే..  న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ గురువారం పండంటి పాపాయికి  జన్మనిచ్చారు. కాగా ఈ విషయాన్నీ స్వయంగా  ఆర్డెర్న్‌ తన ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు. 'ఈ రోజు(గురువారం) ఆక్లాండ్‌ సిటీ హాస్పటల్‌లో ఆడబిడ్డకు జన్మనిచ్చాం. చాలా సంతోషంగా ఉంది, 3.31 కేజీలతో శిశువు జన్మించింది. బిడ్డ ఆరోగ్యంగానే ఉంది. ఆసుపత్రి సిబ్బంది నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నందుకు ధన్యవాదాలు' అంటూ తన ఫేస్‌బుక్‌ లో సంతోషాన్ని పంచుకున్నారు. ఇదిలావుంటే గతేడాది అక్టోబర్‌ నెలలో న్యూజిలాండ్‌ ప్రధానమంత్రిగా జెసిండా ఆర్డెర్న్‌ పదవి బాధ్యతలు చేపట్టారు.

jacinda-ardern-nz-prime-minister-gives-birth-to-girl

English Title
jacinda-ardern-nz-prime-minister-gives-birth-to-girl

MORE FROM AUTHOR

RELATED ARTICLES