ఎర్రచందనం స్మగ్లింగ్.. పోలీసుల అదుపులో 'జబర్దస్త్' హరి

ఎర్రచందనం స్మగ్లింగ్.. పోలీసుల అదుపులో జబర్దస్త్ హరి
x
Highlights

ఎర్రచందనం అక్రమ రవాణాలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన హరి అనే వ్యక్తి పాత్ర ఉందని గురువారం టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు తెలిపారు. జబర్దస్త్‌ షోతో పాటు...

ఎర్రచందనం అక్రమ రవాణాలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన హరి అనే వ్యక్తి పాత్ర ఉందని గురువారం టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు తెలిపారు. జబర్దస్త్‌ షోతో పాటు శంభో శంకర సినిమాలో హరి నటించాడు. శంభో శంకర సినిమాకు హరి ఫైనాన్స్‌ పెట్టాడు. 'జబర్దస్త్'లో పలు స్కిట్లలో పాల్గొని, అమ్మాయి వేషంతో ఎన్నో మార్లు అలరించిన నటుడు హరి ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. చిత్తూరు జిల్లా పోలీసులు ఇప్పుడు అతన్ని విచారిస్తున్నారు. షకలక శంకర్ నటించిన తాజా చిత్రం 'శంభో శంకర'కు అవసరమైన ఫైనాన్స్ ను కూడా హరి అందించాడట. ఇతనిపై సుమారు 20 కేసులున్నాయని, తిరుపతికి చెందిన హరి నేరాలపై పక్కా ఆధారాలు సేకరించి అరెస్ట్ చేశామని పోలీసు అధికారులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories