షూస్ అమ్మిన ఇవాంకా ట్రంప్

Highlights

ఇంతకీ ఇవాంకా ట్రంప్ ఇష్టాయిష్టాలేంటి? ఆమె నేపధ్యమేంటి? చిన్న వయసులోనే బెస్ట్ బిజినెస్ విమెన్ గా ఎదిగిన ఆమె తీరు ఎలాంటిది? శ్వేత సౌధం అధ్యక్షుల...

ఇంతకీ ఇవాంకా ట్రంప్ ఇష్టాయిష్టాలేంటి? ఆమె నేపధ్యమేంటి? చిన్న వయసులోనే బెస్ట్ బిజినెస్ విమెన్ గా ఎదిగిన ఆమె తీరు ఎలాంటిది?

శ్వేత సౌధం అధ్యక్షుల వారికి స్వయానా కుమార్తె అందుకే ఇవాంకా కోసం అసాధారణ భద్రత ఇవాంకాది బాధమయ బాల్యమే చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడం తండ్రి స్త్రీ లోలత్వం పెళ్లికి ముందే తాను పుట్టడం లాంటి అంశాలపై సమాజం నుంచి ఎదురైన విమర్శలను తట్టుకుని నిలబడింది ఇవాంకా తల్లి తండ్రి చిన్నప్పుడే విడిపోవడంతో బంధువులు, బాడీగార్డుల మధ్య ఒంటరిగా పెరిగిందామె స్కూల్ డేస్ లోనే పార్ట్ టైమ్ మోడలింగ్ చేసింది ఎకనామిక్స్ లో డిగ్రీ చేసిన ఇవాంకా ఫ్యాషన్ ఎంటర్ ప్రిన్యుయర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. కొన్నాళ్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసింది.

ఆ తర్వాత కుటుంబ వ్యాపారాలకు పరిమితమైంది. అమెరికా అధ్యక్ష పదవికి డోనాల్డ్ ట్రంప్ పోటీ పడటానికి ముందు వరకూ సెలబ్రిటీ అప్రెంటీస్ గా కూడా పనిచేసింది క్లోతింగ్, షూస్, హ్యాండ్ బాగ్స్, కిడ్స్ షూస్, గ్లాసెస్, ఆభరణాలు ఇలా ఇవాంకా చేయని వ్యాపారం లేదు ఆమె లైఫ్ స్టైల్ పేరుతో వెబ్ సైట్ ను కూడా మెయిన్ టెయిన్ చేసింది. ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన ట్రంప్ టవర్స్ నిర్మాణాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ డీల్స్ కుదర్చడంలో ఆమెది అందె వేసిన చేయి 35 ఏళ్ల ఈ మాజీ మోడల్ కు దేశ , విదేశాల్లో పేరు మోసిన దుస్తుల వ్యాపార కంపెనీలతో ఒప్పందాలున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories