వినగానే పెళ్లి చేసుకోవాలనే ఫీలింగ్‌ కలిగింది: నితిన్

Submitted by arun on Mon, 07/23/2018 - 13:17
Nithiin

నా కెరియర్ ముగిసిన తరువాత ది బిస్ట్ మూవీస్‌లో ఒకటిగా ‘శ్రీనివాస కళ్యాణం’ ఉంటుందన్నారు హీరో నితిన్. రాశీ ఖన్నా జోడిగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీనివాస కళ్యాణం’ ఆడియో వేడుక ఆదివారం నాడు హైదరాబాద్‌లో తారల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా సాగింది. శ్రీనివాస కళ్యాణం పాటల పండుగ కార్యక్రమానికి పెళ్లి గెటప్‌లో వచ్చిన నితిన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.  సతీష్ వేగ్నేశ డైరెక్ట్ చేసిన ఈ కథ మొదట విన్నప్పుడు తనకు కూడా పెళ్లి చేసుకోవాలనిపించిందని నితిన్ అన్నాడు.

మరిన్ని విషయాలు చెబుతూ.. ''నన్ను మా ఇంట్లో పెళ్లి చేసుకోమని అడుగుతూనే ఉన్నారు. అయితే తరువాత చేసుకుంటానులే అంటూ వాయిదా వేస్తూ వస్తున్నాను. సతీష్ వేగ్నేశ నా దగ్గరకి వచ్చి కథ చెప్పగానే నిజంగానే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. అయితే పెళ్లంటే ఇప్పుడు జరిగే పెళ్లిలా కాదు.. మా సినిమాలో జరిగే పెళ్లిలా చేసుకోవాలని అనుకున్నా.. షూటింగ్ ఆరంభంలోనే పెళ్లి సన్నివేశాలు షూట్ చేశారు. ఆ పూజలు, వ్రతాలు చూసి బాబోయ్ పెళ్లంటే ఇలా ఉంటుందా అనుకున్నా.. అది విని మా అమ్మ కంగారు పడుతుందేమోనని టెన్షన్ పడకు మమ్మీ పెళ్లి కచ్చితంగా చేసుకుంటా అని చెప్పాను'' అంటూ ఈ సినిమా తనను ఎంతగా ప్రభావితం చేసిందో.. వెల్లడించాడు. 

Tags
English Title
It Will Be in My Top 3 Films – Nithiin

MORE FROM AUTHOR

RELATED ARTICLES