గుర్తుతెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వొచ్చా.. లేదా..లిఫ్ట్ డౌట్‌ను పటాపంచలు చేసిన హెచ్ఎంటీవీ

గుర్తుతెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వొచ్చా.. లేదా..లిఫ్ట్ డౌట్‌ను పటాపంచలు చేసిన హెచ్ఎంటీవీ
x
Highlights

గుర్తుతెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వొచ్చా.. లేదా..? ముంబైలో ఓ వ్యక్తి లిఫ్ట్ ఇచ్చి.. 15 వందలు ఫైన్ కట్టిన తర్వాత చాలామందిలో ఇదే సందేహం. అందుకే.. ఇవాళ...

గుర్తుతెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వొచ్చా.. లేదా..? ముంబైలో ఓ వ్యక్తి లిఫ్ట్ ఇచ్చి.. 15 వందలు ఫైన్ కట్టిన తర్వాత చాలామందిలో ఇదే సందేహం. అందుకే.. ఇవాళ హెచ్ఎంటీవీ మీ డౌట్ క్లియర్ చేయబోతోంది. చట్టంలో ఉన్నదేంటి.? ముంబైలో జరిగిందేంటి.? పోలీసులు చేసిందేంటి.? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఇక్కడే సమాధానం దొరకబోతోంది. ఇది చూశాక.. లిఫ్ట్ ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోండి.

లిఫ్ట్ ఇచ్చే వాళ్లకిది పెద్ద మేటర్ కాకపోవచ్చు. కానీ తీసుకున్న వాడు మాత్రం మనమిచ్చే లిఫ్ట్ గిఫ్ట్‌లా ఫీలవుతాడు. తర్వాత వాళ్లు చెప్పే థ్యాంక్స్ అనే పదం విన్నప్పుడు మనసులో మనమేదో ఘనకార్యం చేసిన ఫీలింగ్ వస్తుంది. అది తప్పేం కాదు. ఎందుకంటే మనం చేసింది మంచి పనే. కానీ ఇప్పుడు ఆ పని చేయాలంటే కాస్త ఆలోచించాల్సి వస్తోంది. ముంబైలో నితిన్ నాయర్ అనే వ్యక్తి లిఫ్ట్ ఇచ్చి 15 వందలు ఫైన్ కట్టాక అది సోషల్ మీడియాలో వైరల్ అ్యయాక చాలామంది లిఫ్ట్ ఇవ్వాలంటే తెగ ఆలోచిస్తున్నారు. మరి లిఫ్ట్ ఇస్తే నిజంగానే ఫైన్ కట్టాలా..? అందుకే మీ డౌట్ ఇప్పుడు హెచ్ఎంటీవీ క్లియర్ చేయబోతోంది.

ముందుగా ముంబైలో ఏం జరిగిందో తెలుసుకుందాం. ముంబైని ఈ మధ్య భారీ వర్షాలు ముంచెత్తాయి. అలా జూన్ 18న నవీ ముంబై నివాసి నితిన్ నాయర్ తన కారులో ఆఫీసుకు వెళ్తుండగా ఐరోలి సర్కిల్ దగ్గర ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు వర్షంలో రోడ్డుపై నిలబడి ఉన్నారు. వాళ్లు లిఫ్ట్ అడగటంతో నితిన్‌ను మంచి మనసుతో వాళ్లిద్దరికీ లిఫ్ట్ ఇచ్చాడు. కొంతదూరం వెళ్లాక 60 ఏళ్ల వృద్ధుడు కూడా లిఫ్ట్ అడగటంతో తన కారులో ఎక్కించుకున్నాడు. అప్పుడతనికి తెలియదు తాను ఇబ్బందుల్లో పడతానని. నితిన్ లిఫ్ట్ ఇచ్చిన కాసేపటికే ట్రాఫిక్ కానిస్టేబుల్ రావడం కారు ఆపడం ఫోటోలు తీయడం చలానా వేయడం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. తర్వాత కోర్టుకెళ్లి ఫైన్ కట్టి తన లైసెన్స్‌ను తెచ్చుకున్న నితిన్ నాయర్.

నితిన్ నాయర్‌కు సెక్షన్ 66 సబ్ సెక్షన్ 1, సెక్షన్ 192 సబ్ సెక్షన్ A మోటార్ వెహికిల్స్ చట్టం ప్రకారం 15 వందల ఫైన్ వేశారు. దీనికి చిర్రెత్తిపోయిన నాయర్ తన ఫేస్ బుక్‌లో లిఫ్ట్ ఇచ్చినందుకు ట్రాఫిక్ పోలీసులు నాకిచ్చిన గిఫ్ట్ ఇదని చలానా రిసిప్ట్‌ను పోస్ట్ చేశారు. ఇవి మన దేశంలో ఉన్న చట్టాలు. రోడ్డుపై మనిషి చనిపోతున్నా సాయం చేయడం కూడా నేరమేనా అని ప్రశ్నించారు.

ఇప్పుడు అసలు విషయానికొద్దాం వాస్తవానికి మోటార్ వెహికిల్స్ యాక్ట్‌లో ఎక్కడా కూడా లిఫ్ట్ ఇవ్వడం చట్టవిరుద్ధమని లేదు. నితిన్‌కు కూడా లిఫ్ట్ ఇచ్చినందుకు ఫైన్ వేయలేదు. అనుమతి లేకుండా సొంత కారును రవాణాకు వాడినందుకు వేశారు. ఇంకొంచెం క్లియర్‌గా చెప్పాలంటే నాయర్ తన కారును షేరింగ్ క్యాబ్‌గా వాడారేమో అనుకొని ఫైన్ వేశారు. ఇది కేవలం ముంబై ట్రాఫిక్ పోలీసులు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల జరిగిన తప్పిదమే తప్ప చట్టంలో ఎక్కడా లిఫ్ట్ ఇవ్వకూడదని గానీ రోడ్లపై ఇబ్బందుల్లో ఉన్న వారికి సాయం చేయకూడదని గానీ లేదు. సో ఇదీ ముంబై లిఫ్ట్ ఫైన్ వెనకున్న అసలు స్టోరీ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories