తెలంగాణ పారిశ్రామిక వృద్ధి పెరిగింది : కేటీఆర్

x
Highlights

నగరంలోని పార్క్ హోటల్‌లో 2017-18 తెలంగాణ పారిశ్రామిక, వాణిజ్య వార్షిక నివేదికను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి...

నగరంలోని పార్క్ హోటల్‌లో 2017-18 తెలంగాణ పారిశ్రామిక, వాణిజ్య వార్షిక నివేదికను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్, ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. పలువురు పారిశ్రామికవేత్తలు, ఉత్తమ కంపెనీలకు పారిశ్రామిక అవార్డులను కేటీఆర్ అందజేశారు. పలు కంపెనీలతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది.

ఈ సందర్భంగా తెలంగాణ పారిశ్రామికరంగ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. 2017-18లో తెలంగాణ పారిశ్రామిక వృద్ధి 10.4 శాతం పెరిగిందన్నారు. టీఎస్ ఐ-పాస్ ద్వారా రూ.లక్షా 23 వేల 478 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. వీటితో 5.27 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి కలుగుతుందని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలో తొలిస్థానంలో ఉన్నామని తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయం లక్షా 75 వేల 534 రూపాయలని, ఇది దేశ తలసరి ఆదాయం కంటే 55 శాతం అధికమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories