రేపు నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ41

Submitted by arun on Wed, 04/11/2018 - 14:43
PSLV-C41

మరో అంతరిక్ష ప్రయోగానికి ఇస్రో సిద్ధమయ్యింది. పీఎస్‌ఎల్వీ సీ - 41 కౌంట్‌డౌన్ ప్రారంభమయ్యింది గురువారం వేకువజామున 4గంటల 04 నిమిషాలకు నింగిలోకి దూసుకెళుతుంది. పీఎస్‌ఎల్వీ-సీ41 రాకెట్ ఐఆర్‌ఎన్‌ఎస్-1ఐ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లనుంది.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ స్వదేశీ నావి గేషన్‌ వ్యవస్థ పై పూర్తిస్థాయిలో పట్టుసాధించే దిశగా అడుగులు వేస్తోంది అందులో భాగం గానే భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-41 రాకెట్‌ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఐ ఉప గ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి ఇప్పటికే ప్రయోగ ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేసిన భారత శాస్త్రవేత్తలు మంగళవారం రాత్రి 8.04 గంటలకు కౌంట్‌డౌన్‌ను కూడా ప్రారంభించారు. 

మనదేశంతోపాటు సరిహద్దుల నుంచి 1500 కిలోమీటర్ల వరకూ వాహన చోదకులకు ఈ ఉపగ్రహం దిక్సూచిలా సేవలు అందిస్తుంది. పైగా నావిగేషన్‌ వ్యవస్థలో ఇస్రో ప్రయోగిస్తున్న ఐఆర్‌ఎన్‌ఎస్ఎస్ ఉప్రగ్రహ శ్రేణిలో ఇది 8వ శాటిలైట్‌. ఇందుకు సంబంధించిన 43వ పీఎస్ఎల్వీ ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు ఖరారు చేశారు. షార్‌లోని ప్రథమ ప్రయోగవేదిక నుంచి గురువారం తెల్లవారుజామున 4.04 గంటలకు పీఎస్ఎల్వీ-సీ41 రాకెట్‌ను నింగిలోకి పంపాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. భూ ఉపరితలానికి 506 కిలోమీటర్ల ఎత్తుకు 19.19 నిమిషాలలో చేరి.. దేశ నావిగేషన్‌ వ్యవస్థ కోసం సిద్ధం చేసిన ఐఆర్‌ఎన్‌ఎ్‌సఎ్‌స-1ఐని కక్ష్యలోకి చేరవేస్తుంది.
 

Tags
English Title
ISRO to launch the IRNSS-1I navigation satellite aboard the PSLV-C41

MORE FROM AUTHOR

RELATED ARTICLES