షార్ నుంచి మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధం

షార్ నుంచి మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధం
x
Highlights

వరుస ప్రయోగ విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమయ్యింది. జీఎస్ఎల్వీ-ఎఫ్11 రాకెట్ ను శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి రోదసిలోకి...

వరుస ప్రయోగ విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమయ్యింది. జీఎస్ఎల్వీ-ఎఫ్11 రాకెట్ ను శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి రోదసిలోకి పంపనున్నారు. శాటిలైట్ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. రేపు సాయంత్రం 4 గంటల 10 నిమిషాల‌కు నింగిలోకి దూసుకెళ్ల‌నుంది. షార్ నుంచి మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధమయ్యింది. జీఎస్ ఎల్వీ ఎఫ్-11 వాహ‌క నౌక‌ను నింగిలోకి పంపేందుకు ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు స‌న్నాహాలు చేపట్టారు. రేపు సాయంత్రం నాలుగు గంటల 10 నిమిషాల‌కు నింగిలోకి దూసుకెళ్ల‌నుంది. జీఎస్.ఎల్వీఫ్-11 రాకెట్ ద్వారా 2250 కిలోల బరువైన జిశాట్ –7ఏ ఉపగ్రహాన్నిఇస్రో ప్ర‌యోగించ‌నుంది.

ఇది ఇస్రో పంపుతున్న 35వ క‌మ్యూనికేష‌న్ ఉప‌గ్ర‌హం. 2013లో ప్రయోగించిన జీశాట్-7 ఉపగ్రహం కాలపరిమితి మించిపోవడంతో దాని స్థానంలో జీశాట్-7 ఏ ఉపగ్రహాన్ని రోదసీలోకి ప్రవేశపెడుతున్నారు. ఎయిర్స్ ఫోర్స్ సమాచార వ్యవస్థకోసం ఇస్రో ఈ ఉపగ్రహాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ సిరీస్ లో ఇది 13వ రాకెట్. 7వ క్రయోజనిక్ ఇంజిన్ ను జీఎస్ఎల్వీలో ఉపయోగిస్తున్నారు. బెంగళూరులోని యూ.ఆర్.రావు శాటిలైట్ సెంటర్ లో జీశాట్ –7ఏ రూపొందించారు. శ్రీహరికోటలో తుది పరీక్షలు పూర్తయిన తర్వాత జీఎస్ఎల్వీ ఎఫ్-11 రాకెట్ లో అనుసంధానించనున్నారు. ఈ ఉపగ్రహం ఎనిమిదేళ్ల పాటు దేశానికి సేవలందించనున్నది. పెథాయ్ తుపాను శ్రీహరికోట సమీపంలోనే తీరం దాటుతుందని మొదట సంకేతాలు రావటంతో రాకెట్ ప్రయోగంపై కొన్ని సందేహాలు ఏర్పడ్డాయి. తుపాను ఉత్తరాంధ్రకు వెళ్లిపోవడంతో షార్ లో ముందుగా అనుకున్న ప్రకారం రాకెట్ ప్రయోగించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories