సెక్స్ చేస్తూ.. ఊపిరాడక ప్రియురాలి మృతి..

Submitted by arun on Tue, 07/03/2018 - 17:55
sex

ప్రియుడితో సెక్స్ చేస్తూ.. ఓ యువతి ఊపిరాడక  చనిపోయింది. ఈ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఇద్దరు ప్రేమికులు.. గతేడాది మార్చిలో ముంబైలోని కోలాబా ఏరియాకు వచ్చారు. టూరిస్ట్ వీసా మీద ముంబైకి వచ్చిన వారిద్దరూ.. అక్కడున్న ఓ హోటల్‌లో దిగారు. అయితే ఓ రోజు తన ప్రియురాలు అపస్మారక స్థితిలో ఉందని యాకోవ్‌ హోటల్‌ సిబ్బందికి తెలియజేశాడు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.

అప్పట్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఇజ్రాయిల్‌లోని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే  ఈ కేసుకు సంబంధించిన ఫొరెన్సిక్‌ రిపోర్ట్‌ ఇటీవల పోలీసులకు అందింది. ఈ రిపోర్ట్‌లో వారికి విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ఆ ఇజ్రాయిల్‌ జంట లైంగిక చర్యలో ఉండగా.. యాకోవ్‌ ఆమె గొంతు గట్టిగా పట్టుకోని అసహజ శృంగారానికి పాల్పడటంతో ఊపిరాడక మృతి చెందినట్లు రిపోర్ట్‌లో వెల్లడైందని పోలీసులు మీడియాకు తెలిపారు. దీంతో ఏడాది అనంతరం అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం నిందితుడు ఇజ్రాయిల్‌లో ఉన్నాడు.

English Title
Israeli Woman Suffocated During Sex in Mumbai Hotel, Boyfriend Booked

MORE FROM AUTHOR

RELATED ARTICLES