పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్..

Submitted by nanireddy on Tue, 10/09/2018 - 07:11
isi-agent-arrested-from-brahmos-missile-unit-in-nagpur

నాగ్ పూర్ లో ఐఎస్ఐ ఏజెంట్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. బ్రహ్మోస్ మిస్సైల్ యూనిట్ లో పనిచేస్తున్న నిశాంత్ అగర్వాల్.. బ్రహ్మోస్ సాంకేతిక సమాచారాన్ని పాకిస్తాన్ కు అందిస్తున్నట్టు ఆరోపలు రావడంతో అలర్టయిన అధికారులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. నిశాంత్ ఒక్కడేనా, ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. బ్రహ్మోస్‌ క్షిపణికి సబంధించిన కీలక సాంకేతిక సమాచారం పాక్‌కు చేరినట్టు ఆధారాలు బయటడ్డాయి.. ఈ కేసుకు సంబంధింఇ మహారాష్ట్రలోని నాగ్ పూర్ క్షిపణి పరీక్ష కేంద్రంలో ఐఎస్ఐ ఏజెంట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డీఆర్‌డీఓలో గత నాలుగేళ్లుగా పనిచేస్తున్న నిశాంత్ అగర్వాల్.. దేశ రక్షణ వ్యవస్థలో కీలకమైన బ్రహ్మోస్‌ సాంకేతిక సమాచారాన్ని ఐఎస్‌ఐ ద్వారా పాకిస్థాన్‌కు చేరవేస్తున్నట్లు సమాచారం రావడంతో అధికారులు అలర్టయ్యారు. స్ధానిక పోలీసుల సహకారంతో యూపీ ఏటీఎస్‌, మిలిటరీ ఇంటెలిజెన్స్‌ సంయుక్త ఆపరేషన్‌లో నాగ్‌పూర్‌లో నిశాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు.

English Title
isi-agent-arrested-from-brahmos-missile-unit-in-nagpur

MORE FROM AUTHOR

RELATED ARTICLES