నేను బతికేది మరికొన్ని రోజులే.. గుండెలు పగిలే వార్త చెప్పిన నటుడు ఇర్ఫాన్ ఖాన్

Submitted by arun on Thu, 08/02/2018 - 17:47
Irrfan Khan

ప్రాణాంతక కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు ఇర్భాన్ ప్రతి ఒక్కరినీ విషాదంలో ముంచే వ్యాఖ్యలు చేశారు. తాను బతికేది మరికొన్ని నెలలు మాత్రమేనని, ఈ విషయాన్ని నా మెదడు నాకు నిత్యం చెబుతోందంటూ వ్యాఖ్యానించారు. న్యూరోఎండోక్రిన్ ట్యూమర్‌‌‌తో బాధపడుతున్న ఇర్ఫాన్ ప్రస్తుతం లండన్‌లో చికిత్స పొందుతున్నాడు. తాజాగా ఆయన ఓ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.  ‘‘నేను బతికేది మరికొన్ని నెలలు మాత్రమే. ఈ విషయాన్ని నా మెదడు నాకు నిత్యం చెబుతోంది. కొన్ని నెలలు, లేదంటే ఏడాది.. మహా అయితే రెండేళ్లు బతుకుతాను కావచ్చు. ఇకపై ఇటువంటి వ్యాఖ్యలను కట్టిపెట్టేస్తాను. నాకున్న జీవితాన్ని హ్యాపీగా అనుభవిస్తాను’’ అని ఇర్ఫాన్ పేర్కొన్నాడు. ఈ అనుభవంతో తనకు జీవితంపై స్పష్టమైన అవగాహన వచ్చిందని ఇర్ఫాన్ వివరించాడు. ప్రస్తుతం తాను జీవితాన్ని మరో కోణం లోంచి చూస్తున్నట్టు ఇర్ఫాన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కీమో థెరపీ నాలుగు సైకిల్స్ పూర్తయ్యాయని, మొత్తం ఆరు జరగాల్సి ఉందని పేర్కొన్నాడు. ఆరు సైకిళ్లు పూర్తయ్యాక స్కాన్ చేయాల్సి ఉంటుందన్నాడు. ఆ తర్వాత మాత్రమే ఏం చేయాలనేది తెలుస్తుందన్నాడు.

English Title
Irrfan Khan says being in his current state of health has te ..

MORE FROM AUTHOR

RELATED ARTICLES