ఐపీఎల్ లో క్రిస్ గేల్ హవా షురూ

Submitted by arun on Mon, 04/16/2018 - 16:40
Chris Gayle

ఓడలు బళ్లు...బళ్లు ఓడలు అన్నమాట ఐపీఎల్ లో కింగ్స్ పంజాబ్ సునామీ ఓపెనర్ క్రిస్ గేల్ కు అతికినట్లు సరిపోతుంది. ఐపీఎల్ గత సీజన్ వరకూ బెంగలూరు రాయల్ చాలెంజర్స్ ప్రధాన ఆటగాడిగా ఏడాదికి 10 కోట్ల రూపాయల వరకూ అందుకొన్న గేల్ 11వ సీజన్ వేలంలో ఎవరికీ అవసరం లేని ఆటగాడిగా మిగిలాడు. అయితే కింగ్స్ పంజాబ్ మెంటార్ కమ్ కోచ్ వీరేంద్ర సెహ్వాగ్ చొరవతో కనీసధర 2 కోట్ల రూపాయలకే క్రిస్ గేల్ ను తమజట్టులో చేర్చుకొంది. అంతేకాదు ప్రస్తుత సీజన్లో తన తొలిమ్యాచ్ ను చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యర్థిగా ఆడిన గేల్ కేవలం 33 బాల్స్ లోనే 7 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 63 పరుగులతో మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. పంజాబ్ నాలుగు పరుగుల విజయం సాధించడంలో ప్రధానపాత్ర వహించడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొన్నాడు. తన బ్యాటింగ్ లో వాడి వేడీ ఏమాత్రం తగ్గలేదని గేల్ చాటుకొన్నాడు.

English Title
IPL 2018: Chris Gayle's return to form amazing news for KXIP

MORE FROM AUTHOR

RELATED ARTICLES