ఇంటర్‌పోల్‌ అధ్యక్షుడు అదృశ్యం

Submitted by nanireddy on Sun, 10/07/2018 - 07:13
interpol-president-meng-hongwei-missing

అంతర్జాతీయ పోలీస్‌ సంస్థ ఇంటర్‌పోల్‌ అధ్యక్షుడు మెంగ్‌ హాంగ్వే(64) అదృశ్యమయ్యారు. ఇటీవల లియో నుంచి మాతృదేశం చైనాకు చేరుకున్న అయన మొదటిరోజునుంచే కనిపించకుండాపోయాడు. వారం రోజులు గడిచినా హాంగ్వే జాడ తెలియకపోవడంతో ఆయన భార్య ఫ్రాన్స్‌లోని ఇంటర్‌పోల్‌ అధికారులను ఆశ్రయించింది. దీంతో అధికారులు ఆయనకోసం గాలిస్తున్నారు. హాంగ్వే ఇంటర్‌పోల్‌ అధ్యక్ష బాధ్యతలతో పాటు చైనా భద్రత శాఖలో ఉపమంత్రిగా కూడా హాంగ్వే ఉన్నారు. కొంతకాలంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అవినీతిపై యుద్ధం పేరుతో పలువురు రాజకీయ నేతలు, అధికారులను అరెస్ట్‌ చేయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెంగ్‌ హాంగ్వేను అదుపులోకి తీసుకుని ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అదుపులోకి తీసుకున్నట్లయితే కుటుంబసభ్యులకు చెప్తారు కానీ అది జరగలేదు. అయన భార్య తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. మరోవైపు అధికార పార్టీకి చెందిన సెంట్రల్‌ కమిషన్‌ ఫర్‌ డిసిప్లిన్‌ ఇన్‌స్పెక్షన్‌(సీసీడీఐ) అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారని సౌత్‌చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పత్రిక కథనం ప్రచురించింది.

English Title
interpol-president-meng-hongwei-missing

MORE FROM AUTHOR

RELATED ARTICLES