యోగాను ఆరోగ్య సాధనంగా మలుచుకోవాలి

యోగాను ఆరోగ్య సాధనంగా మలుచుకోవాలి
x
Highlights

యోగా సాధనతో శాంతి, ఆరోగ్యం, సంతోషం ప్రాప్తిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్‌ రాజధాని...

యోగా సాధనతో శాంతి, ఆరోగ్యం, సంతోషం ప్రాప్తిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. ప్రజలతో కలిసి ఆయన యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ...ఉత్తరాఖండ్‌ అనేక దశాబ్దాలుగా యోగా, ఆయుర్వేదిక్‌కు ముఖ్య కేంద్రంగా వర్ధిల్లుతోందన్నారు. యోగా.. కుటుంబం, సమాజంలో సద్భావన కలిగిస్తుందన్నారు. డెహ్రాడూన్‌ నుంచి డబ్లిన్‌ వరకు, షాంఘై నుంచి షికాగో వరకు అన్ని దేశాల ప్రజలు యోగాలో నిమగ్నమయ్యారని తెలిపారు. నేడు ప్రతి దేశం యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకున్నాయని మోడీ పేర్కొన్నారు. అతి తక్కువ సమయంలోనే యోగానే ప్రపంచవ్యాప్తమైందన్నారు. యోగాను భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయన్నారు. సూర్యుడి కిరణాలు అన్నివైపులా చేరినట్లే యోగా కూడా అంతటా చేరువవుతోందని పేర్కొన్నారు. యోగా అనేది ప్రాచీన, ఆధునిక ఆరోగ్య సాధనమని.. ప్రతి ఒక్కరూ దీన్ని ఆరోగ్య సాధనంగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు.

యోగా దినోత్సవాన్ని యావత్తు ప్రపంచం నిర్వహిస్తోంది. ఈ ఏడాది ‘శాంతి కోసం యోగా’ అంశంతో నాలుగో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆయుష్‌ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దాదాపు 5 వేల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎర్రకోట దగ్గర బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో యోగా డే నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో నేవీ ఉద్యోగులూ నిర్వహించారు. వైస్ అడ్మిన్ కరంభిర్ సింగ్ సహా మిగిలిన సిబ్బంది అంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి యోగా దినోత్సవంలో పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories