తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

Submitted by arun on Fri, 04/13/2018 - 10:22
Kadiyam Srihari

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఇంటర్‌బోర్డు ప్రధాన కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు.ఇంటర్ ఫస్టియర్ లో 62.3 శాతం, ద్వితీయ సంవత్సరంలో 67 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 4,55,789 మంది విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాశారు. వీరిలో 2,84,224 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 4,29,378 మంది విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశారు. వీరిలో 2,88,772 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి కూడా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ దరఖాస్తుకు ఏప్రిల్ 20 వరకు గడువు. 

ప్రథమ సంవత్సరంలో బాలికలు 69 శాతం, బాలురు 55.66 శాతం ఉత్తీర్ణత సాధించారు. మేడ్చల్ జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరంలో బాలికలు 73.25 శాతం, బాలురు 61 శాతం ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో కొమురం భీం ఆసిఫాబాద్, మేడ్చల్ జిల్లాలు 80శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా 77 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. మహబూబాద్ జిల్లా 40 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో గిరిజన గురుకులాలు సత్తా చాటాయి. గిరిజన గురుకుల పాఠశాలలు అత్యధికంగా 87 శాతం ఉత్తీర్ణత సాధించాయి. సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్స్ 86 శాతం ఉత్తీర్ణతతో రెండోస్థానంలో నిలిచాయి. 69 శాతంతో ప్రైవేట్ జూనియర్ కాలేజీలు చివరిస్థానంలో నిలిచాయి. మే 14 నుంచి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఏప్రిల్ 20 గడువుగా ఉంది. 

ఫలితాలను https://tsbie.cgg.gov.in, www.bie.telangana.gov.in, www.exam.bie.telangana.gov.in, http://results.cgg.gov.in, http://bie.tg.nic.in and http://examresults.ts.nic. వెబ్‌సైట్‌కు లాగిన్ అయి తెలుసుకోవచ్చు. 
 

English Title
Inter First & Second Year Results Declared by Minister Kadiyam Srihari

MORE FROM AUTHOR

RELATED ARTICLES