2019 వరల్డ్‌కప్ ఫిక్స్‌డ్ : వివాదంలో ధోనీ

Submitted by lakshman on Fri, 12/15/2017 - 11:33

మహేంద్రసింగ్ ధోనీ వివాదంలో చిక్కుకున్నాడు. ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన ఎనిమిదేళ్లలో కేవలం మూడు సార్లే ట్వీట్స్ కు లైక్ చేశాడు. వాటిలో 2013 రాజ్ దీప్ సర్దేశాయ్ ట్వీట్, 2014 డిసెంబర్ 31 బీసీసీఐ ట్వీట్ లైక్ కొట్టాడు. అవి ఎలా ఉన్నా దాదాపు మూడేళ్ల తర్వాత  ఓ ట్వీట్ కు ధోనీ లైక్ చేయడం వివాదాస్పదమైంది.  ఇన్‌ఖబర్ అనే న్యూస్ ఛానల్ '2019 వరల్డ్‌కప్ ఫిక్సయింది.. ఈసారి అది పక్కాగా ఇండియాకే' అని తన అకౌంట్ లో ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ కు ధోనీ లైక్ కొట్టడం చర్చాంశనీయంగా మారింది. అయితే ఫిక్స్ అయింది అంటే మనవాళ్లు అన్నీ ఫార్మాట్లలో దూసుకెళుతున్నారు కాబట్టి 2019 వరల్డ్ కప్ మన ఇండియాదేనని దాని సారాంశం అయిండొచ్చు. కానీ అసలే ఫిక్సింగ్ లు నడుస్తున్న ఈ టైంలో ఫిక్స్ అయిందనే మాటను కొంతమంది మ్యాచ్ ఫిక్సింగ్ కోణంలో చూస్తున్నారని కొందరంటున్నారు. 
 

English Title
InKhabar Controversial Tweet MS Dhoni Liked On Twitter

MORE FROM AUTHOR

RELATED ARTICLES