వైసీపీలో చేరిన బీజేపీ నేత

Submitted by nanireddy on Wed, 09/05/2018 - 15:44
indukuri-raghu-raju-joins-ysrcp-1

 ఎన్నికలకు ఇంకా 9 నెలల సమయం ఉండగానే వివిధ పార్టీలలోకి ఇప్పుడిప్పుడే వలసలు 
ఊపందుకున్నాయి. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  భారతీయ జనతా పార్టీ నేత, విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఇందుకూరి రఘురాజు. శనివారం ఆ పార్టీకి రాజీనామా చేసి అయన నేడు(బుధవారం) వైసీపీలో చేరారు. ప్రస్తుతం విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఆయన పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాతో ఆయనను వైఎస్‌ జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. కాగా ఇవాళ్టితో జగన్ పాదయాత్ర విశాఖలో ఆరు నియోజకవర్గాల్లో పూర్తి చేసుకుంది. ఈనెల 9 న విశాఖలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది వైసీపీ. అందులో భాగంగా దాదాపు 2 లక్షల మంది కార్యకర్తలను మీటింగుకు రప్పించాలని భావిస్తోంది. 

English Title
indukuri-raghu-raju-joins-ysrcp-1

MORE FROM AUTHOR

RELATED ARTICLES