పాలపిట్ట శకున ఫలితం

Submitted by lakshman on Sun, 09/17/2017 - 19:23

ప్రతి ఒక్కరూ తాము తలపెట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని కోరుకుంటూ వుంటారు. అలా పూర్తికావాలి అంటే ఆ కార్యం నిమిత్తం బయలుదేరేటప్పుడు మంచి శకునం ఎదురుగా రావాలని ఆశిస్తూ వుంటారు. తలపెట్టిన కార్యాన్ని ఎదురుగా వచ్చే శకునం తప్పనిసరిగా ప్రభావితం చేస్తుందనే విశ్వాసం పూర్వకాలం నుంచీ వుంది.ఈ శకునాలలో మనుషులు మాత్రమే కాకుండా కొన్ని జంతువులు ... పక్షులు కూడా పేర్కొనబడుతున్నాయి. అలాగే కొన్ని రకాల ధ్వనులను కూడా శకునాలుగా భావిస్తూ వుండటం జరుగుతోంది. ముత్తయిదువులు నీళ్ల బిందెతో ఎదురైనా .. ఆవుదూడలు ఎదురైనా .. ఆలయంలో నుంచి గంట మోగిన శబ్దం వినిపించినా శుభశకునాలుగా భావించాలని చెప్పబడుతోంది.అలాగే పాలపిట్ట శకునం కూడా శుభసూచకంగా విశ్వసించబడుతోంది.

ఏదైనా ఒక ముఖ్యమైన కార్యం నిమిత్తం ప్రయాణమైనప్పుడు ఎదురుగా పాలపిట్ట వస్తే అది శుభసూచకంగా భావించి బయలుదేరాలని స్పష్టం చేయబడుతోంది. తలపెట్టిన కార్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతుంది.ఈ కారణంగానే విజయదశమి రోజున జమ్మిపూజ అనంతరం పాలపిట్టను చూసే ఆచారం తరతరాలుగా వస్తోంది. గ్రామీణ ప్రాంతాలలోని వారు జమ్మిపూజ అనంతరం పాలపిట్ట దర్శనానికి బయలుదేరుతారు. పాలపిట్ట కనిపించిన తరువాతనే వెనుదిరుగుతారు. ఈ రోజున పాలపిట్టను చూడటం వలన ఏడాదిపాటు ఏ కార్యాన్ని ఆరంభించినా అది సఫలీక తమవుతుందని విశ్వసిస్తుంటారు. ఇలా పాలపిట్ట శకునం వలన కార్యసిద్ధి కలుగుతుందనీ, విజయం చేకూరుతుందని స్పష్టం చేయబడుతోంది.

English Title
indian roller

MORE FROM AUTHOR

RELATED ARTICLES