కజ్కిస్తాన్‌లో భారతి విద్యార్థి హత్య - యునివర్శిటి నిర్లక్ష్యం

Submitted by admin on Thu, 11/15/2018 - 16:07

వైద్య విద్యకోసం దేశం కాని దేశం వెళ్లిన ఒక విద్యార్థి నిండు ప్రాణాన్ని కొందరు దుండగులు బలి తీసుకున్నారు.రాజస్తాన్‌కు చెందిన విద్యార్థి హేమంత్‍ వైద్య విద్య కోసం రెండేళ్ల క్రితం వెళ్లాడు.ప్రస్థుతం మూడు సంవత్సరం చదువున్న హేమంత్‌ను కజకిస్తాన్‌కి చెందిన కొందరు హత్య చేశారు.కాగా ఇక్కడి అధికారుల మరియు కజక్ మెడికల్ యునివర్శిటి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగినట్టు ఇక్కడి విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

యునివర్శిటి వారు చదువు కోసం విదేశాల నుండి ఇక్కడికి వచ్చేవారికి సరైన హాస్టల్ ఇవ్వక పోవడం కారణంగా ,అనేక మంది బయట రూమ్‌లు తీసుకుని ఉండవలసి వస్తుందని,ఇలా బయట ఉండాల్సిన వారు ఖర్చు తక్కువ అనో లేక ఎక్కడ ఉండాలి అనే దానిపై సరైనా అవగాహాన లేక ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఉంటున్నారు.నేరాలు ఎక్కువ జరిగే ప్రాంతాలు కావడంతో తరుచు దోపిడీలకు,జాత్యాహంకారానికి గురైవుతూ పలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.అదే యునివర్శిటి వారు సరైన వసతి కల్పిస్తే ఇలాంటి ఘటనలు చాలా వరకు తగ్గిపోతాయని ఇక్కడి వారి మాట.ఏదేమైన అధికారుల నిర్లక్ష్యానికి,యునివర్శిటీ చేసిన తప్పు వల్ల ఒక విద్యార్థి బలి కావాల్సి వచ్చింది.

English Title
indian medical student killed in khajakh

MORE FROM AUTHOR

RELATED ARTICLES