కాల్పుల్లో భారతీయుడి మృతి

Submitted by nanireddy on Sat, 12/16/2017 - 11:41

అమెరికాలోని ఒహయో రాష్ట్రంలో దోపిడీ దొంగలు ఓ భారతీయ అమెరికన్‌ను కాల్చి చంపారు. కరుణాకర్‌ కరేంగ్లే (53) అనే వ్యక్తి ఫెయిర్‌ఫీల్డ్‌ ప్రాంతంలోని ‘జిఫ్ఫీ కన్వినియెన్స్‌ మార్ట్‌’ అనే సూపర్‌మార్కెట్‌లో పనిచేస్తుండేవారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ముసుగులు ధరించి స్టోర్‌లోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు కరుణాకర్‌పై కాల్పులు జరిపి నగదును దోచుకుని పారిపోయారు. పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, కరుణాకర్‌ శుక్రవారం ప్రాణాలు విడిచారు. అక్కడకు దగ్గర్లోని ప్రాంతాల్లో ఆయనకు బంధువులెవరూ లేరని తాము భావిస్తున్నామని పోలీసులు చెప్పారు.

English Title
Indian killed in united state of gun fire

MORE FROM AUTHOR

RELATED ARTICLES