విరాట్ కొహ్లీని ఊరిస్తున్న ప్రపంచ రికార్డు

Highlights

భారత క్రికెట్ నయా సంచలనం విరాట్ కొహ్లీని త్రీ-ఇన్- వన్ ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. ఇప్పటికే ఇన్ స్టంట్ వన్డే క్రికెట్, ధూమ్ ధామ్ టీ-20 విభాగాలలో...

భారత క్రికెట్ నయా సంచలనం విరాట్ కొహ్లీని త్రీ-ఇన్- వన్ ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. ఇప్పటికే ఇన్ స్టంట్ వన్డే క్రికెట్, ధూమ్ ధామ్ టీ-20 విభాగాలలో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడిగా ఉన్న కొహ్లీ...సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో సైతం టాప్ ర్యాంక్ సాధించే అవకాశం ఉంది. అయితే...అదెలాగో తెలుసుకోవాలని ఉందా?

ఐదురోజుల సాంప్రదాయ టెస్ట్ క్రికెట్....ఒక్కరోజులో ముగిసిపోయే ఇన్ స్టంట్ వన్డే క్రికెట్.....మూడున్నర గంటల్లో ధూమ్ ధామ్ గా సాగిపోయే టీ-20 క్రికెట్. ఫార్మాట్ ఏదైనా సరే తనదైన స్టయిల్లో...అలవోకగా పరుగులు...హాఫ్ సెంచరీలు, సెంచరీలు, డబుల్ సెంచరీలు సాధించడంలో....కొహ్లీకి కొహ్లీ మాత్రమే సాటి.

29 సంవత్సరాల కొహ్లీ...ఇటీవలి శ్రీలంక సిరీస్ వరకూ ఆడిన 63 టెస్టుల్లో 20 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలతో సహా మొత్తం 5వేల 268 పరుగులు సాధించాడు. కెప్టెన్ గానే 13 శతకాలు బాది అరుదైన రికార్డు. ఇక...వన్డే క్రికెట్లో....2017 న్యూజిలాండ్ సిరీస్ వరకూ...ఆడిన 202 మ్యాచ్ ల్లో...32 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలతో 9వేల 30 పరుగులు నమోదు చేశాడు. ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో....ఆడిన 55 మ్యాచ్ ల్లోనే 18 హాఫ్ సెంచరీలతో...1956 పరుగులు సాధించాడు. 90 పరుగుల నాటౌట్ గా అత్యధిక స్కోరు నమోదు చేశాడు. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం.....ఇటు వన్డే....అటు టీ-20 ఫార్మాట్లలో కొహ్లీనే ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ గా ఉన్నాడు.

వన్డే క్రికెట్లో 889 పాయింట్లతో టాప్ ర్యాంకర్ స్థానం సాధించిన కొహ్లీ.....టీ-20 క్రికెట్లో 824 పాయింట్లతో నంబర్ వన్ స్థానం సంపాదించాడు. ఇక...టెస్ట్ క్రికెట్లో మాత్రం విరాట్ కొహ్లీ 893 పాయింట్లు సాధించి...ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తర్వాతి స్థానంలో...అదీ రెండోర్యాంక్ లో నిలిచాడు. శ్రీలంకతో ఇటీవలే ముగిసిన తీన్మార్ టెస్ట్ సిరీస్ తొలిటెస్టులో సెంచరీ, రెండోటెస్టులో డబుల్ సెంచరీ, ఆఖరిటెస్టులో సైతం డబుల్ సెంచరీ సాధించి...సెంచరీల హ్యాట్రిక్ తో వారేవ్వా! అనిపించుకొన్నాడు.
2017 సీజన్లో కొహ్లీ మొత్తం 9 టెస్టులు, 26 వన్డేలు, 10 టీ-20ల్లో పరుగుల మోతతో హోరెత్తించాడు. తన కెరియర్ లోనే అత్యుత్తమంగా రాణించాడు. గత ఏడాదికాలంగా భారత ఉపఖండ వికెట్ల పైన...అదీ శ్రీలంక, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లాంటి జట్లపైన చెలరేగిపోయిన కొహ్లీ...ఫాస్ట్, బౌన్సీ వికెట్లకు మరోపేరైన సఫారీగడ్డపై సౌతాఫ్రికాతో జరిగే సిరీస్ లో రాణించడం ద్వారా సత్తా చాటుకోవాల్సి ఉంది. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ 938 పాయింట్లతో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకులో ఉంటే...కొహ్లీ మాత్రం 893 పాయింట్లతో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. స్మిత్ కంటే కేవలం 45 పాయింట్లతో వెనుకబడి ఉన్న కొహ్లీ...సౌతాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్ లో పూర్తిస్థాయిలో రాణించగలిగితే ...టెస్ట్ ఫార్మాట్లో సైతం టాప్ ర్యాంక్ సాధించడం ఏమంత కష్టంకాబోదు.. ప్రస్తుత యాషెస్ సిరీస్ లో ఇంగ్లండ్ తో స్టీవ్ స్మిత్ మరో మూడుటెస్టులు ఆడాల్సి ఉంది.
ఒకవేళ విరాట్ కొహ్లీ....స్మిత్ పేరుతో ఉన్న టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంక్ ను అధిగమించగలిగితే.....క్రికెట్ చరిత్రలోనే...మొత్తం మూడు ఫార్మాట్లలోనూ ప్రపంచ నంబర్ వన్ స్థానం సాధించిన మూడో క్రికెటర్ గా, భారత తొలి క్రికెటర్ గా నిలిచిపోతాడు .

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్...2005-06 సీజన్లో త్రీ- ఇన్- వన్ గా నిలిచిన తొలి క్రికెటర్ ఘనత సొంతం చేసుకొన్నాడు. మరో ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూ హేడెన్ సైతం....అతితక్కువకాలం మాత్రమే మూడుఫార్మాట్లలోనూ టాప్ ర్యాంకర్ గా గుర్తింపు సంపాదించాడు. ఏదిఏమైనా...2017 సీజన్లో అపూర్వంగా రాణించిన విరాట్ కొహ్లీకి.....2018 సీజన్ తొలిసిరీస్ గా జరిగే సఫారీటెస్ట్.....సత్తాకు సవాలు మాత్రమే కాదు....నంబర్ వన్ ర్యాంక్ చేరడానికి లభించిన గోల్డెన్ చాన్స్ కూడా.

Show Full Article
Print Article
Next Story
More Stories