ఐఫోన్ కోసం సింగపూర్‌కు

Submitted by lakshman on Sun, 09/24/2017 - 19:23

సింగపూర్: ఐఫోన్ అంటే ఇష్టముండనివారు ఎవరుంటారు..! ఏడాదికొక కొత్త మోడల్‌ను ఆపిల్ కంపెనీ ప్రవేశపెట్టడం ఆలస్యం.. ఆ ఫోన్‌ను ఎప్పుడెప్పుడు చేతిలో చూసుకుంటామా అన్న తాపత్రయం చాలా మందిలో ఉంటుంది. ఇక్కడ ఆ ఫోన్ విడుదల కాకపోతే వేరే దేశంలో క్యూలో నిలబైడెనా సరే వెనువెంటనే దానిని దక్కించుకోవాలన్న ఆత్రుత ఉంటుంది చాలా మందికి. వ్యాపారవేత్తలూ అందుకు మినహాయింపేమీ కాదు.

భారత్‌కు చెందిన అమిన్ అహ్మద్ ధోలియా (43) అనే వ్యాపారవేత్త తన కూతురుకు పెళ్లికానుకగా కొత్త ఐఫోన్ 8ను బహుమతిగా ఇచ్చేందుకు రాత్రికి రాత్రే సింగపూర్ ఫ్లైట్ ఎక్కేశారు. గురువారం రాత్రి 7 గంటలకు సింగపూర్‌లో దిగిన ఆయన.. రాత్రంతా సింగపూర్ ఆర్కర్డ్ రోడ్‌లోని ఆపిల్ స్టోర్‌ముందు లైన్లో వేచి ఉన్నారు. తెల్లారేసరికి 200 మందికి పెరిగిపోయిన ఆ క్యూలైన్‌లో ఉన్నది మొదటి వ్యక్తి ఆయనే. ఒక కూతురికి పెళ్లికానుకగా ఐఫోన్ 8ను ఇచ్చి.. మరో కూతురుకు ఇవ్వకపోతే ఆమె అలగదూ.. అందుకే ఆమె కోసమూ మరో ఫోన్ కొనేశానంటూ సంతోషంగా చెప్పారు.

English Title
Indian businessman flies to Singapore to buy new iPhone as wedding gift

MORE FROM AUTHOR

RELATED ARTICLES