టెస్ట్ క్రికెట్లో ఎట్టకేలకు జడేజా ధూమ్ ధామ్ సెంచరీ

టెస్ట్ క్రికెట్లో ఎట్టకేలకు జడేజా ధూమ్ ధామ్ సెంచరీ
x
Highlights

సౌరాష్ట్ర చిరుత, టీమిండియా స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్ట్ క్రికెట్లో ఎట్టకేలకు తన తొలి సెంచరీ సాధించాడు. హోంగ్రౌండ్ సౌరాష్ట్ర క్రికెట్...

సౌరాష్ట్ర చిరుత, టీమిండియా స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టెస్ట్ క్రికెట్లో ఎట్టకేలకు తన తొలి సెంచరీ సాధించాడు. హోంగ్రౌండ్ సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియం వేదికగా విండీస్ తో జరుగుతున్న తొలిటెస్ట్ రెండోరోజుఆటలో జడేజా ధూమ్ ధామ్ సెంచరీ బాదాడు. కేవలం 132 బాల్స్ లోనే 5 బౌండ్రీలు, 5 సిక్సర్లతో వంద పరుగుల స్కోరు సాధించి అజేయంగా నిలిచాడు. 2012లో నాగపూర్ విదర్భ స్టేడియం వేదికగా ఇంగ్లండ్ పై టెస్ట్ అరంగేట్రం చేసిన జడేజా తొలి శతకం సాధించడానికి 38 టెస్టులపాటు ఎదురుచూడాల్సి వచ్చింది. ప్రస్తుత రాజ్ కోట్ టెస్ట్ కు ముందు వరకూ ఆడిన 37 టెస్టుల్లో 9 హాఫ్ సెంచరీలు సాధించిన జడేజా 38వ టెస్టులో మూడంకెల స్కోరు అందుకొన్నాడు. జడేజా మెరుపు సెంచరీతో టీమిండియా 9 వికెట్లకు 649 పరుగుల భారీస్కోరు సాధించగలిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories