భారత్‌ విజయ లక్ష్యం 217

Submitted by arun on Sat, 02/03/2018 - 10:28
ind

రికార్డు స్థాయిలో నాలుగోసారి అండ‌ర్ 19 వ‌రల్డ్‌క‌ప్ సొంతం చేసుకోవ‌డానికి 217 ప‌రుగుల దూరంలో ఉంది యంగిండియా. ఇవాళ ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న ఫైన‌ల్లో టీమిండియా బౌల‌ర్లు అద్భుతంగా రాణించారు. పేసర్ న‌గ‌ర్‌కోటితోపాటు స్పిన్నర్లు చెల‌రేగ‌డంతో ఆసీస్ 47.2 ఓవ‌ర్ల‌లో 216 ప‌రుగుల‌కే ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌.. మొద‌ట్లో బాగానే ఆడినా.. స్పిన్న‌ర్లు దిగిన త‌ర్వాత సీన్ మారిపోయింది. ఇషాన్ పోరెల్‌, న‌గ‌ర్‌కోటి, అనుకూల్‌రాయ్‌, శివ సింగ్ తలా నాలుగు వికెట్లు తీసుకున్నారు. ఒక ద‌శ‌లో 134 ప‌రుగుల‌కే 3 వికెట్ల‌తో ఉన్న ఆసీస్‌.. 82 ప‌రుగుల తేడాలో 7 వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా చివ‌రి ప‌ది ఓవ‌ర్ల‌లో ఆసీస్‌ను పూర్తిగా క‌ట్టడి చేశారు భార‌త బౌల‌ర్లు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మెర్లో మాత్రమే 76 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఇప్పటికే మూడేసి సార్లు వ‌రల్డ్‌క‌ప్ గెలిచిన ఇండియా, ఆస్ట్రేలియా.. ఇప్పుడు రికార్డు స్థాయిలో నాలుగో వ‌ర‌ల్డ్‌క‌ప్‌పై క‌న్నేశాయి. శుభ్‌మాన్ గిల్‌, పృథ్విషా, మ‌న్‌జోత్ క‌ల్రాల‌తో కూడిన ప‌టిష్ఠ టాపార్డర్ ఈ ల‌క్ష్యాన్ని సునాయాసంగా చేదించే అవ‌కాశాలు ఉన్నాయి.

English Title
India vs Australia

MORE FROM AUTHOR

RELATED ARTICLES