డోనాల్డ్ ట్రంప్ కు భారత్ షాక్.. అమెరికా దిగుమతులపై సుంకాల పెంపు..!

Submitted by arun on Sat, 08/04/2018 - 16:51
india, america

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వాణిజ్య యుద్దానికి తెరతీస్తున్నారు. అమెరికా గత కొన్ని రోజులుగా విదేశీ వస్తువులపై సుంకాలు పెంచుతోంది. ఆ లిస్ట్ లో భారత్ కూడా ఉంది. ఇప్పటికే ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబడుతూ చైనా, రష్యాలు కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు పెంచాయి. అయితే సుంకాల పెంపు నుంచి భారత వస్తువులను మినహాయించాలని కోరగా అమెరికా తిరస్కరించింది. 

దీంతో భారత్ కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే కొన్ని వస్తువులపై సుంకాలు పెంచాలని ఈ ఏడాది జూన్ లో నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 4 నుంచి దానిని అమలు చేయాలని భావించింది. అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువుల్లో బాదం, వాల్ నట్స్, ఆపిల్స్ తదితర ఉత్పత్తులపై సుంకాలు పెరగనున్నాయి.  అయితే సుంకాల పెంపు అమలు తేదీలో భారత్ మార్పుచేసింది. దానిని సెప్టెంబరు 18కి వాయిదా వేసింది. అయితే ఈ సుంకాల కారణంగా భారత్ వల్ల అమెరికాకు కలిగే వాణజ్య లోటును తగ్గించే ప్రయత్నం చేస్తున్టన్నట్లు ట్రంప్ ప్రకటించారు.

Tags
English Title
india gave shot to trump government

MORE FROM AUTHOR

RELATED ARTICLES