మూడో వన్డేలో సౌతాఫ్రికాపై భారత్ ఘనవిజయం

మూడో వన్డేలో సౌతాఫ్రికాపై భారత్ ఘనవిజయం
x
Highlights

టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడో వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. 6 వన్డేల సిరీస్‌లో 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన...

టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడో వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. 6 వన్డేల సిరీస్‌లో 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 304 పరుగుల స్కోరుతో వీర విహారం చేసింది. కెప్టెన్ కోహ్లీ 160 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిస్తే, ధవన్ 76 పరుగులు చేశాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లు పెద్దగా రాణించలేకపోయారు. ఆల్ రౌండర్ డుమిని రెండు వికెట్లు పడగొట్టాడు. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాకు ఏదీ కలిసిరాలేదు. బ్యాట్స్‌మన్ ఆమ్లా తక్కువ స్కోరుకే ఔట్ అవడంతో టీమ్ ఇండియాను ఇతర ఆటగాళ్లు పోటీ ఇవ్వలేకపోయారు. డుమిని హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా ఇతర బ్యాట్స్‌మెన్‌లు సరైన భాగస్వామ్యం ఇవ్వలేకపోయారు. భారత్ స్పన్నర్లు చాహల్, కుల్దీప్‌లు చెరో 4 వికెట్లు పడగొట్టడంతో సౌత్ ఆఫ్రికా 179 పరుగలకే కుప్పకూలింది.
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోగా... భారత్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే రోహిత్ శర్మ డకౌటవ్వడంతో భారత్‌కు ఆదిలోనే గట్టిదెబ్బ దెబ్బ తగిలింది. రోహిత్ ఔటవ్వడంతో ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి పరుగుల వర్షం కురింపించాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి అద్భుతమైన ప్రదర్శనతో మరో సెంచరీ నమోదు చేశాడు. 118 బంతుల్లో కొహ్లీ సెంచరీ చేశాడు. ధావన్ భాగస్వామ్యంతో (76 పరుగులు) కెప్టెన్ కోహ్లీ చెలరేగిపోయాడు. మొత్తం 160 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ధవన్ 76, భువనేశ్వర్ 16, పాండ్యా 14, రహానే 11, ధోనీ 10 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా ఆటగాళ్లు డుమిని 51, మార్‌క్రమ్ 32, మిల్లర్ 25, జోండో 17, మోరిస్ 14, రబడ 12 పరుగులు చేసి 179 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories