బీజేపీ ప్రభుత్వం జగన్ తో కుమ్మక్కై నాపై ఐటి దాడులు : సీఎం రమేష్

Submitted by nanireddy on Fri, 10/12/2018 - 09:51
income-tax-raids-cm-ramesh

కొన్నిరోజులుగా ఏపీలో ఐటి దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొందరు రాజకీయ నేతలపై దాడులు జరిగాయి. తాజాగా టీడీపీ ఎంపీ సీఎం రమేష్ నివాసాలు, వ్యాపార కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో   సీఎం రమేష్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన తన నివాసాల్లో, కంపెనీల్లోనూ జరుగుతున్న దాడులు కుట్రతోనే జరుగుతున్నాయంటున్నారు. బీజేపీ ప్రభుత్వం జగన్, విజయసాయిరెడ్డితో కుమ్మక్కై ఐడీ దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. తాను నిజాయితీగా ఉన్నానని, ఇలాంటి వాటికి బెదిరేది లేదని సీఎం రమేష్ అన్నారు. కాగా ఐటి దాడులపై స్పందించిన ఆ పార్టీ నేతలు కుట్రలో భాగంగానే ఐటి దాడులు కేంద్రం చేయిస్తుందని మండిపడుతున్నారు. జగన్, పవన్ బీజేపీతో కుమ్మక్కైందని వారంటున్నారు. మరోవైపు ఈ దాడులపై  స్పదించిన వైసీపీ నేతలు పదవి విరుస్తున్నారు. టీడీపీ నేతలపై దాడులు తమ పార్టీకి ఏమి సంబంధమని అంటున్నారు. 

English Title
income-tax-raids-cm-ramesh

MORE FROM AUTHOR

RELATED ARTICLES