చంద్రునిపై ఇగ్లూ ఇళ్లు

Submitted by arun on Fri, 03/02/2018 - 12:24
Igloos on moon

విశ్వాంతరాల్లోకి ప్రయాణించే క్రమంలో జాబిల్లిని మజిలీగా ఉపయోగించుకునేందుకు భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో సమాలోచనలు ప్రారంభించింది. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లా కృత్రిమ మజిలీ కాకుండా ఏకంగా చంద్రుడిపైనే ఆవాసాలు నిర్మించాలని భావిస్తోంది. 

మంచు ఖండంలో నిర్మించే ఇగ్లూల వంటి నిర్మాణాలను చంద్రుడిపై నిర్మించాలని శాస్త్రవేత్తలు యోచిస్తున్నారు. ఇప్పటికి ఇంకా ప్రణాళికలు సిద్ధం కాలేదు. అంతా అనుకున్నట్లుగా జరిగితే రాబోయే కాలంలో భారతదేశం చేపట్టబోయే అతిపెద్ద సైన్స్ పోగ్రామ్ ఇదే అవుతుంది.

చంద్రునిపై రోబోలతో త్రీడీ పద్ధతిలో ‘ప్రింట్’ చేసే ఈ నిర్మాణాలను లూనార్ హ్యాబిటేట్స్‌గా వ్యవహరించనున్నారు. చంద్రుడి ఉపరితలంపై ఉన్న మట్టిని, ఇతర పదార్థాలను కలిపి రోబోలు ఈ ఇగ్లూలను నిర్మించనున్నారు. ఈ ఇగ్లూలను నిర్మించేందుకు ఐదు రకాల మోడళ్లను సిద్ధం చేశామని, పూర్తి స్థాయిలో సహకరించే సాంకేతికత కోసం ఎదురుచూస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అంతరిక్ష ప్రయోగాల కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఐఎస్ఎస్ భవిష్యత్తులో నిరుపయోగంగా మారనున్నందున దానికి ప్రత్యామ్నాయంగా ఇగ్లూలు నిర్మించే పనిలో ఇస్రో పడింది. అంటార్కిటికాలో పరిశోధనల కోసం భారత్ నిర్మించిన నిర్మాణాల మాదిరిగానే ల్యూనార్ హ్యాబిటేట్స్ ఉంటాయి. 

ల్యూనార్ హ్యాబిటేట్స్ తో భవిష్యత్తులో చంద్రుడిపైకి వెళ్లే వ్యోమగాములు కొన్ని గంటల పాటు మాత్రమే గడిపి తిరిగి రావాల్సిన అవసరం తప్పుతుంది అక్కడ ఉండే సమయాన్ని ఈ ఇగ్లూల సాయంతో మరింత పెరుగుతుంది. చంద్రు డిపై వ్యోమగాముల భద్రతతో పాటు అక్కడ వారి పరిశోధ నలోనూ సాయం చేసేందుకు ఇస్రో బాధ్యత వహిస్తుంది. ఇస్రో సొంతంగా తయారుచేసుకున్న మట్టి.. చంద్రుడి మట్టికి సరిపోలడంతో చంద్రుడిపై నిర్మాణం స్మార్ట్ గా తీర్చిదిద్దగలమని ఇస్రో ధీమా వ్యక్తం చేస్తోంది. ఇస్రో సంకల్పం సఫలమైతే అంతరిక్షంలో భారత్ తోపాటు ప్రపంచ అంతరిక్ష ప్రయోగాలకు గొప్ప ముందడుగు అవుతుంది. 

English Title
'Igloos' on the moon: ISRO begins work on future outposts

MORE FROM AUTHOR

RELATED ARTICLES