టీ 20 వరల్డ్ కప్‌లో బోణీ కొట్టిన టీమిండియా

Submitted by chandram on Sat, 11/10/2018 - 10:12
 ICC Women's

మహిళల టీ 20 ప్రపంచ కప్‌లో భారత అమ్మాయిలు బోణీ కొట్టారు. గయానా‌లో న్యూజిలాండ్ తో జరిగిన పోరులో టీమిండియా 34 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 194 పరుగులను సాధించింది. భారత బ్యాట్స్‌వుమెన్లలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 103, రోడ్రిగ్స్‌ 59 పరుగులు చేశారు. అనంతరం 195 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేయగలింది. భారత బౌలర్లలో హేమలత 3, పూనమ్‌ యాదవ్‌ 3, రాధా యాదవ్‌2, అరుంధతి రెడ్డి ఒక వికెట్‌ పడగొట్టారు.

English Title
ICC Women's World T20, Highlights, India vs New Zealand, Full Cricket Score: Harmanpreet Kaur-led India win by 34 runs

MORE FROM AUTHOR

RELATED ARTICLES