పార్లమెంట్‌కు పోటీ చేస్తా : కోమటిరెడ్డి

పార్లమెంట్‌కు పోటీ చేస్తా : కోమటిరెడ్డి
x
Highlights

ఇటివలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్కంఠ పోరులో కాంగ్రెస్ బోల్తాకొట్టిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుండి వరుసగా నాలుగుసార్లు గెలుపొంది...


ఇటివలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్కంఠ పోరులో కాంగ్రెస్ బోల్తాకొట్టిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుండి వరుసగా నాలుగుసార్లు గెలుపొంది తాజాగా ఐదోసారి కోమటిరెడ్డి ఓటమి రుచి చూశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ 20 ఏళ్లుగా ఎల్లపుడు ప్రజల్లో ఉండే నాయకుడిగా తన జీవితం ప్రజాసేవకే అంకితమని తెలిపారు. అలాగే తాను పార్లమెంట్‌కు పోటీ చేయాలని ఎపుడో నిర్ణయించుకున్నట్లు, ఈ విషయం కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీతో కూడా చర్చిచనని రాహుల్ గాంధీ కూడా సరేనన్నారని తెలిపారు. నల్గొండ పార్లమెంట్‌ సభ్యుడిగా జిల్లా నాయకుల అందరి సహాయంతో తప్పకుండా పోటీచేస్తానని కోమటిరెడ్డి స్ఫష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories