ప్రేమలో పడి తప్పు చేశాను..కేరీర్ నాశనం అయ్యింది : రెజీనా

ప్రేమలో పడి తప్పు చేశాను..కేరీర్ నాశనం అయ్యింది : రెజీనా
x
Highlights

దక్షిణాది చిత్ర పరిశ్రమలో రెజీనా కసాండ్రా అందంతోపాటు అభినయంతో మెప్పించింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న సమయంలో రెజీనాకు సడన్‌గా బ్రేక్ పడింది....

దక్షిణాది చిత్ర పరిశ్రమలో రెజీనా కసాండ్రా అందంతోపాటు అభినయంతో మెప్పించింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న సమయంలో రెజీనాకు సడన్‌గా బ్రేక్ పడింది. ప్రస్తుతం మళ్లీ సక్సెస్ అందుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. తన కెరీర్ గ్రాఫ్ పడిపోవడానికి గల కారణాలను వెల్లడిస్తూ ఇటీవల ప్రముఖ దినపత్రికతో తన భావాలను పంచుకొన్నది. రెజీనా చెప్పినదేమింటే..పదేళ్ల కెరీర్‌లో అనేక మలుపులు, ఒడిదుడుకులను చూశాను. ఆ కారణంగానే ఉన్నత స్థాయికి చేరుకోలేకపోయాను. ఇప్పుడు పలు అడ్డంకులను ఎదుర్కొని నన్ను నేను నిరూపించు కోవాలనుకొంటున్నాను. నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆ కారణంగానే యాక్టర్ అయ్యాను. ప్రస్తుతం వాటిని సరిదిద్దుకొనేందుకు ప్రయత్నిస్తున్నాను.ఓ వ్యక్తితో ప్రేమలో పడటం కెరీర్‌పై దెబ్బ పడింది. ఏదో తప్పు చేస్తున్నాను అనే సమయానికి పరిస్థితులు చేజారాయి. ఆ మత్తు వదిలే సరికి పుణ్యకాలం గడిచిపోయిందని చెప్పింది. ఇకపై ప్రేమ, పెళ్లి అనే ఆలోచనలకు స్థానం లేకుండా కేవలం కెరీర్‌పైనే దృష్టి పెడతానంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories