ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నా: జేసీ

ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నా: జేసీ
x
Highlights

అనంతపురం: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. తన రాజీనామాను...

అనంతపురం: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. తన రాజీనామాను సోమవారం లోక్‌సభ స్పీకర్‌కు అందజేయనున్నట్లు జేసీ చెప్పారు. తాడిపత్రిలో నెలకొన్న నీటి కొరత సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యానని, అందుకే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నియోకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయని, అందువల్ల తాను ఎంపీనయ్యాక ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయానని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. జేసీ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారోనని సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే జేసీ తీసుకున్న నిర్ణయంపై ఓ ఆసక్తికర చర్చ కూడా సాగుతోంది.

కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్నాళ్లూ జేసీ హవా నడిచిందని, టీడీపీలో ఆ పరిస్థితి లేనందువల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని ప్రచారం జరుగుతోంది. పైగా జిల్లా తెలుగుదేశం పార్టీలో పరిటాల కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చి, తమ కుటుంబాన్ని చిన్నచూపు చూస్తున్నారనే అసంతృప్తితో జేసీ రగిలిపోతున్నారని జిల్లాలో కొందరు మాట్లాడుకుంటున్నారు. జేసీ కుటుంబానికి, పరిటాల కుటుంబానికి మొదటి నుంచి విభేదాలున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎంపీ పదవికి రాజీనామా చేయడమే కాకుండా, త్వరలో టీడీపీకి కూడా జేసీ రాజీనామా చేసే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, రాజీనామా విషయంలో మరోసారి పునరాలోచించుకోవాలని సీఎం చంద్రబాబు జేసీ దివాకర్‌రెడ్డికి సూచించినట్లు సమాచారం. జేసీ పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచిన విషయం విదితమే. జేసీ దివాకర్‌రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా రాజీనామా చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories