చేతులెత్తేసిన విశాల్.. పార్టీ గోవిందా..!

Highlights

నాలుగు రోజుల కిందట ఆర్కేనగా ఉపఎన్నికల్లో పోటీకి దిగుతానని వేసిన నామినేషన్ ను తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే.. అయితే రాజకీయ నాయకులు ఫెయిల్ అయ్యారని...

నాలుగు రోజుల కిందట ఆర్కేనగా ఉపఎన్నికల్లో పోటీకి దిగుతానని వేసిన నామినేషన్ ను తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే.. అయితే రాజకీయ నాయకులు ఫెయిల్ అయ్యారని తాను బరిలోకి దిగుతానని చెప్పిన విశాల్, నేడు పార్టీ పెట్టాలన్న ఆలోచన తనకు లేదని బాంబు పేల్చారు. అంతేకాదు పార్టీ పెట్టే ప్రసక్తే లేదని, ప్రజాహితం కాంక్షిస్తూ, మంచి పనులు చేయడానికి సిద్ధం అని వ్యాఖ్యానించారు. ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో నామినేషన్‌ తిరస్కరణ విశాల్‌ రాజకీయ పయానానికి ఆదిలోనే హంస పాదు అన్నట్టుగా మారింది . ఈ విషయంగా ఓ మీడియాకు ఆదివారం విశాల్‌ ఇంటర్వూ్య ఇచ్చారు. ఆ మేరకు ప్రజలకు మంచి చేద్దామన్న ఉద్దేశంతో ఆర్కేనగర్‌లో పోటీకి సిద్ధపడానే గానీ, మరే కారణాలు లేవని స్పష్టంచేశారు. ఆర్కేనగర్‌ ప్రజలకు మంచి జరిగి ఉంటే, తాను వచ్చి ఉండే వాడిని కాదని వ్యాఖ్యానించారు.

అయితే, విశాల్‌ అంటే కొందరికి ఎందుకు అంత భయమో తనకే అంతు చిక్కడం లేదన్నారు. తనను గురిపెట్టి దిగజారుడు, ఇంకా చెప్పాలంటే, నీచ రాజకీయాల్ని ప్రదర్శించారని మండిపడ్డారు. సినిమాల్లో కూడా చూడని ట్విస్టులు, బెదిరింపులు, కిడ్నాప్‌ల పర్వాల్ని ప్రత్యక్షంగా ఆర్కేనగర్‌లో తాను చూశానని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎందరో స్వతంత్య్ర అభ్యర్థులు పోటీలో ఉండగా, ఒక్క విశాల్‌ను మాత్రం టార్గెట్‌ చేయడం బట్టి చూస్తే, తనకు ప్రజాదరణ ఉందన్న విషయాన్ని ఆ వ్యక్తులు గుర్తించినట్టున్నారని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories