డివైడర్‌ను ఢీ కొట్టిన కారు.. విద్యార్థి దుర్మరణం

Submitted by arun on Sat, 06/09/2018 - 12:29
 road accidnet

హైదరాబాద్ రాయదుర్గం చౌరస్తాలో కారు బీభత్సం సృష్టించింది. ఫిల్మ్‌ నగర్  నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు.. JRC దగ్గర డివైడర్‌ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరొకరికి తీవ్రగాయాలు 
వివరాలివి.. సంకరపల్లి మండలం మొకీల గ్రామంలో సుభిస్‌ విడ్సర్‌ విల్లాలో అనంత్‌ రెడ్డి కుటుంబం నివాసం ఉంటుంది. అతని కుమారుడు రాహుల్‌(TS07fx3699)బెంజ్‌కారులో ఫిల్మ్‌నగర్‌ నుంచి మణికొండ వైపు వెళ్తున్నాడు. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టి మూడు పాల్టీలు కొట్టింది. దీంతో రాహుల్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతని హుటాహుటిన దగ్గరల్లో ఉన్న ఆస్పత్రికి తరలించగా అప్పటికే రాహుల్‌ మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.  ఈ ప్రమాదంలో గాయపడిన మరొకరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

English Title
hyderabad-road-accident

MORE FROM AUTHOR

RELATED ARTICLES