మెట్రో ప్రయాణికులకు శుభవార్త

Submitted by arun on Fri, 04/20/2018 - 17:05
metro

నగర మెట్రో ప్రయాణికులకు శుభవార్త. శనివారం ఉదయం నుంచి రద్దీ సమయాల్లో ప్రతి 7 నిమిషాలకో మెట్రో రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కొత్త సిగ్నలింగ్ వ్యవస్థకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ(సీఎంఆర్‌ఎస్) అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు. ఈ విషయం నగర ప్రయాణికులతో పంచుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్‌ ట్వీట్ చేశారు. మియాపూర్ - అమీర్‌పేట్ - నాగోల్ మధ్య రేపు ఉదయం 6 గంటల నుంచి రద్దీ సమయాల్లో ప్రతి 7 నిమిషాలకు మెట్రో రైలు, రద్దీ లేని సమయాల్లో ప్రతి 8 నిమిషాలకు ఓ రైలు నడవనుంది. 

English Title
hyderabad metro will now run trains every 7 minutes during peak hours

MORE FROM AUTHOR

RELATED ARTICLES