భార్యపై దారుణానికి పాల్పడ్డ భర్త

Submitted by nanireddy on Mon, 08/06/2018 - 07:29
husbend-murder-attempt-on-wife-in-banaganipalle

కర్నూల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అతి కిరాతకంగా హత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటన బనగానపల్లెలో చోటుచేసుకుంది. బాలయోసు, కవిత దంపతులకు 10 రోజుల కిందటే వివాహం జరిగింది. పెళ్ళైనరోజునుంచే బాలయోసు భార్య కవితను వేధించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో వీరిమధ్య కలతలు రేగాయి. ఆదివారం కూడా వీరిమధ్య గొడవ జరిగింది. దీంతో మద్యం మత్తులో ఆవేశానికి గురైన భర్త బాలయేసు బ్లేడ్‌తో భార్య గొంతు కోశాడు. మహిళ గొంతు కోయడం గమనించిన స్థానికులు బాలయోసును పట్టుకుని చితకబాదారు. దాంతో అతను కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఇద్దరినీ  బనగానపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గత కొంతకాలం సహజీవనం చేసిన వీళ్లిద్దరు 10 రోజుల కిందటే పెళ్లి చేసుకున్నారు. బాలయోసు ప్రవర్తనతో విసిగిపోయిన భార్య కవిత, అతనితో కాపురానికి నిరాకరించింది.దీంతో బాలయోసు ఈ దారణానికి ఒడికట్టాడు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English Title
husbend-murder-attempt-on-wife-in-banaganipalle

MORE FROM AUTHOR

RELATED ARTICLES