కన్యాదానం సినిమా.. ఒడిశాలో నిజంగా జరిగింది!

Submitted by arun on Mon, 03/12/2018 - 13:54
Marriage

శ్రీకాంత్, ఉపేంద్ర, రచన నటించిన కన్యాదానం సినిమా చూశారా? అందులో ఉపేంద్ర, రచన ప్రేమించుకుంటారు. అనుకోని పరిస్థితుల్లో రచన, శ్రీకాంత్ పెళ్లి చేసుకుంటారు. తర్వాత.. అసలు విషయం తెలుసుకుని.. రచనను ఉపేంద్రకు ఇచ్చి శ్రీకాంత్ దగ్గరుండి పెళ్లి చేస్తాడు. అంటే.. తన భార్యను.. ఆమె ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడన్నమాట. అచ్చంగా ఇదే కథ.. ఇప్పుడు ఒడిశాలో జరిగింది.

అసలు విషయం ఏంటంటే.. ఒడిశా రాష్ట్రం సుందర్ గఢ్ జిల్లా బర్గామ్ పరిధిలో పామర అనే గ్రామం ఉంది. అక్కడ.. బాసుదేవ్ టప్పో అనే 28 ఏళ్ల యువకుడు.. 24 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకున్నాడు. కానీ.. అంతకు ముందే.. ఆ అమ్మాయి తన బావతో ప్రేమలో ఉందని తెలుసుకున్నాడు. చివరికి.. ఆ అమ్మాయిని.. తన కుటుంబ సభ్యులను ఒప్పించిన బాసుదేవ్ టప్పో.. ఆ ఇద్దరికి పెళ్లి చేశాడు.

ఈ వివాహానికి.. గ్రామ సర్పంచ్ తో పాటు.. ఇరు వైపుల కుటుంబ సభ్యులు అనుమతించడంతో… అచ్చం కన్యాదానం సినిమా లాగే.. కథ సుఖాంతమైంది. ప్రేమ జంట ఒక్కటైంది.
 

English Title
husband sets wife marriage her lover

MORE FROM AUTHOR

RELATED ARTICLES