క‌ట్నం తేలేద‌ని భార్య కిడ్నీ దొంగిలించాడు!

Submitted by arun on Thu, 02/08/2018 - 13:21
Dowry Harassment

పుట్టింటి నుంచి అడిగినంత క‌ట్నం తేలేద‌ని భార్య కిడ్నీనే దొంగిలించాడు కోల్‌క‌తాకు చెందిన ఓ ప్ర‌బుద్ధుడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్నది. ఈ కేసులో బాధితురాలి భర్తతో పాటు అతని సోదరున్ని అరెస్టు చేశారు. బాధితురాలు రీటా సర్కార్‌కు రెండేళ్ల క్రితం తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దాంతో ఆమెను హాస్పటల్‌కు తరలించారు. ఆ తర్వాత ఆమెకు అపెండిక్స్ సర్జరీ చేశారు. అయితే 2017లో మళ్లీ ఆమెకు ఉదరసంబంధమైన నొప్పి వచ్చింది. దీంతో ఆమె మళ్లీ హాస్పటల్‌కు వెళ్లింది. ఈసారి ఆమెకు స్కాన్ చేశారు. దాంట్లో ఆమె కుడి కిడ్నీ లేదని డాక్టర్లు గుర్తించారు. ఆ విషయం తెలియడంతో బాధితురాలు రీటా షాక్ అయ్యింది.

తన భర్త కొన్నేళ్లుగా కట్నం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని, ఆపరేషన్ పేరుతో రెండేళ్ల క్రితం తన భర్తే కిడ్నీని అమ్మేసినట్లు ఆమె వెల్లడించారు. తాను చాన్నాళ్లుగా గృహహింసకు బలైనట్లు ఆమె చెప్పింది. రెండేళ్ల క్రితం కోల్‌కతాలో ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్‌కు తీసుకువెళ్లి ఆపరేషన్ చేయించారని, అయితే ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని తన భర్త ఆదేశించాడని, కానీ వాళ్లు కిడ్నీని దొంగలించిన విషయం ఇప్పుడే తెలిసినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తన కుటుంబం కట్నం ఇవ్వలేదన్న ఉద్దేశంతో తన భర్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆమె వెల్లడించింది. అవయవాల అక్రమ రవాణా కింద కేసును బుక్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

English Title
husband sell his wife kidney

MORE FROM AUTHOR

RELATED ARTICLES