భూమ్మీద జీవరాశి మరో 21 ఏళ్లలో అంతం : నాసా

Highlights

భూమ్మీద జీవరాశి మరో 21 ఏళ్లలో అంతం కాబోతోందా?. సర్వస్వం ధారపోసి నిర్మించుకున్న మన అందమైన లోకంపైకి ఓ భారీ ఉల్క రాకాసి దూసుకొస్తోంది. ఈ మేరకు నాసా ఓ...

భూమ్మీద జీవరాశి మరో 21 ఏళ్లలో అంతం కాబోతోందా?. సర్వస్వం ధారపోసి నిర్మించుకున్న మన అందమైన లోకంపైకి ఓ భారీ ఉల్క రాకాసి దూసుకొస్తోంది. ఈ మేరకు నాసా ఓ ప్రకటన విడుదల చేసింది. 2004లో తాము గుర్తించిన 'అపోఫిస్‌' అనే రాకాసి ఆస్టరాయిడ్‌ భూమిని ఢీ కొట్టే అవకాశం ఉన్నట్లు చెప్పింది. 2004 నుంచి అపోఫిస్‌ను నాసా నిశితంగా పరిశీలిస్తోంది.

అత్యాధునిక విధానాలను ఉపయోగించి దాని ప్రయాణ మార్గాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. తాజా అంచనాల ప్రకారం.. 2036 ఏప్రిల్‌ 13న ఈ భారీ గ్రహ శకలం భూమిని ఢీ కొట్టబోతోంది. ఫలితంగా భూ గ్రహంపై మానవులు అంతరించిపోయే ముప్పు వాటిల్లుతుందని నాసా పేర్కొంది. ఈ మేరకు నాసా తన వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపర్చిందని అమెరికా గూఢచర్య సంస్థ ఒకటి వెల్లడించింది

అంతేకాదు 21 సంవత్సరాల తరువాత ఈ అపోఫిస్ మన భూమికి చాలా దగ్గరగా వస్తుంది. భూమికి ఎంత దగ్గరగా అంటే... దానికి భూమికి మధ్య కేవలం 39 వేల కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండేంత దగ్గరగా వస్తుంది. అప్పుడు ఎలాంటి పరికరాల సాయం లేకుండానే నేరుగా మన కళ్ళతో దాన్ని స్పష్టం చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భూమికి అంత దగ్గరగా వచ్చే ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశాలు ఎంతో కొంత మేరకు తప్పకుండా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే అదే సమయంలోనే అపోఫిస్ భూమిని ఢీకొట్టకుండా ఏమేం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దిశగా, గట్టి ప్రయత్నాలను వారు మొదలెట్టేశారు కూడా. కాబట్టి మనం ప్రశాంతంగా ఉండవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories