ఫోన్‌ చాటింగ్‌తో బట్టబయలైన వివాహేతర సంబంధం

Submitted by arun on Sat, 06/23/2018 - 10:38
Ruchika Jain

జాతీయ స్థాయి స్కేటింగ్ ప్లేయర్ రుచికా జైన్ తన భర్త నిజ స్వరూపం బయటపెట్టారు. పెళ్లికి ముందే ఆయనకు మరో అమ్మాయితో సంబంధం ఉందని, తనను వేధిస్తున్నాడని ఆరోపించింది. వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని తనను క్షోభకు గురి చేశారంటూ ఆమె పోలీసుకుల ఫిర్యాదు చేసింది. శుక్రవారం రాత్రి వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. 

బోయినపల్లికి చెందిన నగల వ్యాపారి అక్షయ్ జైన్‌‌ను గతేడాది డిసెంబరులో రుచిక వివాహం చేసుకున్నారు. మూడు నెలల తర్వాత వీరి వివాహంలో చిచ్చు రేగింది. మారేడు‌పల్లికే చెందిన మరో మహిళతో అక్షయ్ వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నట్టు ఆయన సెల్‌ఫోన్‌లోని చాటింగ్ ద్వారా రుచిక గుర్తించారు. విషయం తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పెద్దలతో మాట్లాడి సయోధ్య కుదర్చాలనుకున్నారు.

అయితే, అక్షయ్ కుటుంబ సభ్యులు మాత్రం ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు. ఈ కాలంలో ఇవన్నీ సహజమేనంటూ అక్షయ్‌ను సమర్థించారు. దీంతో గత నెల 25న రుచిక తన భర్తపై బేగంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ భర్త చాటింగ్ వివరాలను బయటపెట్టారు. అయితే, రుచిక ఆరోపణలను అక్షయ్ ఖండించారు.

English Title
Hubby, in-laws harassing me, says skating champ Ruchika Jain

MORE FROM AUTHOR

RELATED ARTICLES